Pregnancy Mood Swings: గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా? అందుకే అలా అవుతుందట..

|

Jul 01, 2024 | 9:26 PM

ప్రతి మహిళ తాను తల్లి అయ్యే క్షణాలను పదిలంగా దాచుకుంటుంది. అందుకే అమ్మ అవడం ఏ అమ్మాయికైనా ప్రత్యేకం. అయితే ప్రతి మహిళా.. గర్భధారణ సమయంలో అనేక శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శారీరక సమస్యలతోపాటు మానసిక స్థితి కూడా ప్రభావితం అవుతుంది. నిజానికి, గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీంతో మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, అలసట, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి..

1 / 5
ప్రతి మహిళ తాను తల్లి అయ్యే క్షణాలను పదిలంగా దాచుకుంటుంది. అందుకే అమ్మ అవడం ఏ అమ్మాయికైనా ప్రత్యేకం. అయితే ప్రతి మహిళా.. గర్భధారణ సమయంలో అనేక శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శారీరక సమస్యలతోపాటు మానసిక స్థితి కూడా ప్రభావితం అవుతుంది.

2 / 5
నిజానికి, గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీంతో మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, అలసట, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. గర్భధారణ సమయంలో శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. భౌతిక, పర్యావరణ సమస్యలు మనస్సును ప్రభావితం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి గర్భధారణ సమయంలో మీ మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి.

3 / 5
గర్భధారణ సమయంలో మానసిక స్థితి ఎక్కువగా శరీరంపై ఆధారపడి ఉంటుంది. కాళ్ళ నొప్పి, కడుపులో అసౌకర్యం, అలసట గర్భధారణ సమయంలో సాధారణంగా కనిపించే లక్షణాలు. వీటిని నివారించాలంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం పుష్కలంగా నీరు త్రాగాలి. డాక్టర్ సలహా మేరకు కొబ్బరి నీల్లు, చెరుకు రసం, నిమ్మరసం, జ్యుసి ఫ్రూట్‌లను డైట్‌లో చేర్చుకోవాలి. చాలా మంది అలసట నుండి ఉపశమనం కోసం తరచుగా టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. కానీ, గర్భధారణ సమయంలో ఇలా చేయకూడదు. టీ లేదా కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఇది అలసట, నిద్రలేమి, కండరాల ఒత్తిడి సమస్యలను కలిగిస్తుంది. టీ, కాఫీలకు బదులు పండ్ల రసం తీసుకోవడం మంచిది.

4 / 5
చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో నిద్రలేమిని అనుభవిస్తారు. ఈ సమస్యను దూరం చేయడానికి తల కింద మెత్తని దిండు పెట్టుకోవాలి. పడుకునేటప్పుడు పాదాలకు నూనె రాసి మసాజ్ చేసినాఉపశమనం కలుగుతుంది. అలాగే రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్ లేదా టీవీ చూడటం మానేయాలి.

5 / 5
శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన ప్రసవానికి గర్భధారణ సమయంలో చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. ఎల్లవేళలా పడుకునే బదులు రోజువారీ దినచర్యలో తేలికపాటి కార్యకలాపాలు చేసుకుంటూ ఉండాలి. ఉదయాన్నే తేలికపాటి యోగా, ప్రాణాయామం తప్పకుండా చేయాలి. అప్పుడు మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఆహారం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో ఎక్కువగా  తినడం మంచిది కాదు. కానీ, వేళకు సరిగ్గా తినకపోవడం వల్ల మీతోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి పౌష్టికాహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. నూనె-మసాలా, ఉప్పు, పంచదార వంటి ఆహారాలు తక్కువగా తినాలి.  అప్పుడు శరీరంతోపాటు మానసిక స్థితి బాగుంటుంది.