Pigmentation: ముఖంపై మొంగు మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? వీటిని సులువుగా తొలగించాలంటే..

|

Jan 01, 2024 | 12:01 PM

మొంగు మచ్చలు, పిగ్మెంటేషన్ మచ్చలు తొలగించడం చాలా కష్టం. ఎన్ని ప్రయత్నాలు చేసినా త్వరగా వదిలిపోవు. ఒక్కోసారి మేకప్‌తో కూడా మొంగు మచ్చలు కవర్ చేయడం కుదరదు. ముఖంపై ఇవి నల్లగా, మచ్చలతో నిండిపోయి అసహ్యంగా కనిపిస్తుంటాయి. క్రీములు లేదా ఫేషియల్స్ అప్లై చేయడం ద్వారా ఈ మచ్చలను తొలగించడం సాధ్యం కాదు. ఈ కింది టిప్స్ ఆధారంగా ముఖంపై ఉన్న మరకలన్నీ సులభంగా తొలగించుకోవచ్చు..

1 / 5
మొంగు మచ్చలు, పిగ్మెంటేషన్ మచ్చలు తొలగించడం చాలా కష్టం. ఎన్ని ప్రయత్నాలు చేసినా త్వరగా వదిలిపోవు. ఒక్కోసారి మేకప్‌తో కూడా మొంగు మచ్చలు కవర్ చేయడం కుదరదు. ముఖంపై ఇవి నల్లగా, మచ్చలతో నిండిపోయి అసహ్యంగా కనిపిస్తుంటాయి. క్రీములు లేదా ఫేషియల్స్ అప్లై చేయడం ద్వారా ఈ మచ్చలను తొలగించడం సాధ్యం కాదు. ఈ కింది టిప్స్ ఆధారంగా ముఖంపై ఉన్న మరకలన్నీ సులభంగా తొలగించుకోవచ్చు.

2 / 5
మొంగు మచ్చలను తొలగించుకోవడానికి చాలా మంది సీరం వాడుతున్నారు. ఈ సీరంను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే.. ఒక స్పూన్‌  బియ్యంలో ఒక స్పూన్‌ సోపు గింజలు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ బియ్యం-సోంపు గింజలతోపాటు నాలుగు దోసకాయ ముక్కలు కూడా వేసి వాటి సారాన్ని స్ట్రైనర్‌లో వడకట్టాలి.

3 / 5
మచ్చలను తొలగించడానికి ఈ మూడు పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ వడకట్టిన నీటిలో ఒక చెంచా గ్లిజరిన్ కలపాలి. అర చెంచా అలోవెరా జెల్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని కలపాలి. వాటిని బాగా కలిపితే సీరం తయారయినట్లే.

4 / 5
దీన్ని గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ముఖాన్ని బాగా కడుగుకుని.. బియ్యప్పిండి, నిమ్మరసం కలిపి ప్యాక్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటిలో గుడ్డను తడిపి ముఖాన్ని తుడుచుకోవాలి. ఇది రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. ముఖంపై మురికి లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఈ సీరం డ్రాపర్‌ని తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. మచ్చలు ఉన్నచోట ఎక్కువగా అప్లై చేయాలి.

5 / 5
పూర్తిగా ఆరిన తర్వాత లైట్ నైట్ క్రీమ్ రాసుకోవాలి. చలికాలంలో ముఖాన్ని సంరక్షించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ముఖం పొడిబారినట్లు కనిపిస్తే తేలికపాటి మాయిశ్చరైజర్‌ను రాయడం మర్చిపోవద్దు.