
పొన్నగంటి కొరకు కావలసిన పదార్థాలు: రెండు పొన్నగంటి కూర కట్టలు, ఒక కప్పు కందిపప్పు , ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, నాలుగు పచ్చిమిర్చి , అర టేబుల్ స్పూన్ పసుపు , ఇంకా రుచికి సరిపడా ఉప్పు , ఇంకా కొద్దిగా చింతపండు, తాగినన్నీ నీరు, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , రెండు ఎండు మిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

పొన్నగంటి కూర తయారీ విధానం : పొన్నగంటి కూరను ముందుగా బాగా కడిగి సన్నగా పెట్టుకోవాలి. ఇంకా ఈ కుక్కర్‌లో కందిపప్పు, పొన్నగంటి కూర, నాలుగు టమాటా, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా పసుపు, తగినంత నీరుకూడా వేసి 5 విజిల్స్ వచ్చే వరకు దీనిని బాగా ఉడికించాలి. ఇలా ఉడికిస్తే మంచి రుచి వస్తుంది.

పొన్నగంటి కూర తయారీ విధానం స్టెప్ -1 : ఈ కుక్కర్లోని కూర బాగా చల్లారిన తర్వాత పప్పును తీసుకుని గరిటతో మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంకా ఈ చింతపండు రసం కూడా వేసి మరో 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అలాగే, చిన్న పాన్‌లో ఆయిల్ లేదా నెయ్యి కూడా చేసి దానిలో ఆవాలు, జీలకర్ర కూడా వేయాలి.

వెల్లుల్లి, ఇంకా నాలుగు ఎండు మిర్చి, ఇంకా నాలుగు కరివేపాకు ఆకులు వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు బాగా వేయించాలి. ఈ తాలింపును పప్పులో కూడా వేసి బాగా కలపాలి. ఇంకా 2 నిమిషాల పాటు బాగా వేయించి కిందకు దించడమే. ఇంకా దీనిలో కొద్దిగా నెయ్యితో తింటే రుచి డబుల్ అవుతుంది. వెల్లుల్లి వేస్తె రుచి అదిరిపోతోంది.

వేడి అన్నం, కొద్దిగా నెయ్యి, పొన్నగంటి కూర మిక్స్ చేసి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ రాగి సంగటి, జొన్న రొట్టెలతో తింటే రుచి అదిరిపోతోంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)