ఉసిరి గురించి మోదీ ఏం చెప్పారో తెలుసా?

Updated on: Sep 28, 2026 | 11:53 AM

ఉసిరిని భారతీయ సూపర్ ఫుడ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్‌లో భాగంగా, ఉసిరి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ ఉసిరి ప్రాముఖ్యత, ఎందుకు తినాలి? అనే దాని గురించి దేశ ప్రజలకు చాలా గొప్పగా వివరించారు.

1 / 5
మోదీ మాట్లాడుతూ.. మన ఇంటిలో ఉసిరిని ఏదో ఒక రకంగా ఉపయోగిస్తుంటాం. పచ్చడి, మురబ్బా, జ్యూస్, గమ్మీస్, ఇలా ఏదో ఒకరకంగా ఉసిరిని ఉపయోగిస్తూనే ఉంటాం. మన పూర్వీకులు కూడా తర తరాలుగా ఉసిరిని ఉపయోగింస్తూ దానికి సంబంధించిన ప్రయోజనాల గురించి కూడా చెబుతూనే వచ్చారు. అందుకే భారతీయుల సూపర్ ఫుడ్ ఇది. ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందని తెలియజేశారు.

2 / 5
కేవలం ఉసిరి ప్రయోజనాలు తెలియజేయడమే కాకుండా, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు ఉసిరికి ఉన్న అనుబంధం గురించి కూడా ఆయన మన్ కీ బాత్‌లో గుర్తు చేయడం జరిగింది. మోదీ జిల్లాను ప్రస్తావించి, అక్కడ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకం ద్వారా ఉసిరి సాగు, ప్రాసెసింగ్ కు కొత్త ఊపు వచ్చిందని తెలిపారు. అంతే కాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అది ఎంతో ఉపయోగకరంగా ఉందని, జిల్లాలో దాదాపు 100 ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పని చేస్తున్నాయని తెలిపారు. అంతే కాకుండా ఇక్కడ  మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ వెల్లడించారు.

3 / 5
 మహిళ స్వయం సహకార సంఘాల మహిళలు  ఉసిరి క్యాండీ, మురబ్బా, జ్యూస్ తయారు చేస్తూ  తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. ఎక్కువగా  దేవ్ గఢ్ కమాసి గ్రామనికి చెందిన వారు వీటిని తయారు చేస్తూ  ఆదాయం పెంచుకున్నారని తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా మరొ గ్రామానికి చెందిన వారు,  ఉసిరి పచ్చడి, జీర్ణ శక్తిని పెంచే పొడి తయారు చేస్తూ తమ సంపాదనను రెట్టింపు చేసుకున్నారని తెలియజేశారు.

4 / 5
అంతే కాకుండా మోదీ మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి ఒక సూపర్ ఫ్రూట్ అనేది ఉంటుంది. దానికి ఒక నైపుణ్యం ఉంటుంది. ఓడీఓపీ పథకం ద్వారా మీరు స్థానిక మార్కెట్ ద్వారా మీరు దానిని జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకెళ్లడమే మీ లక్ష్యం ఇది 'వోకల్ ఫర్ లోకల్' ఉద్యమాన్ని, స్వావలంబన భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేస్తుందని, పండుగ సీజన్ లో స్థానిక ఉత్పత్తులనే కొనాలని మోదీ పిలునిచ్చారు.

5 / 5
 ఇక ఉసిరి ఆరోగ్యానికి చేసే మేలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉసిరిని ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది పోషకాల గని. దీనిలో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us