
అయితే ఈ పవిత్రమైన సమయంలో కొన్ని పనులు చేయడం అస్సలే మంచిది కాదు అంటున్నారు పండితులు. పితృపక్షంలో కొన్ని తప్పులు చేయడం వలన ఇది పితృ దోషాలకు కారణం అవుతుందంట. అందువలన వాస్తు ప్రకారం ఈ మాసం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను మీ ఇంటి నుంచి తొలిగించాలంట. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

విరిగిన విగ్రహాలు : చాలా మంది తమ ఇంటిలో విరిగిన పాడైపోయిన విగ్రహాలు అలాగే ఉంచేస్తుంటారు. కానీ ఇది వాస్తు ప్రకారం అస్సలే మంచిది కాదంట. ఇంట్లో విరిగిన విగ్రహాలను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరిగుతుంది అని చెబుతున్నారు వాస్తు పండితులు. అంతే కాకుండా మీరు ఎన్ని పూజలు చేసినా నిరుపయోగమేనంట. అందువలన విరిగిన విగ్రహాలను పవిత్ర నదిలో నిమజ్జనం చేయండి.

పనిచేయని గడియారం : ఎవరి ఇంటిలో అయితే గోడకు విరిగిన లేదా పని చేయని గడియారం వేలాడుతూ ఉంటుందో వారికి దురదృష్టం కలుగుతుందంట. అందువలన ఎప్పుడూ కూడా విరిగి ఉన్న వాటిని ఇంటిలో ఉంచుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరి ఇంటిలో అయితే పని చేయని, గడియారం ఉంటుందో, ఇది వారికి వృత్తి వ్యాపారంలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట

పగిలిన పాత్రలు : అదే విధంగా ఇంటిలో పగిలిన పాత్రలు కూడా ఉండటం మంచిది కాదంట. వాస్తు ప్రకారం ఇది చాలా సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందువలన ఇంటిలో పగిలిన వస్తువులు, పాత డ్రెస్‌లో, చిరిగినవి ఉంటే బయట వేయడమే మంచిది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు