పింక్ పవర్ రన్ 3.0 గ్రాండ్ సక్సెస్.. హైదరాబాద్‌లో ఉత్సాహంగా పాల్గొన్న యువత

Updated on: Sep 27, 2026 | 11:49 AM

HMDA గ్రౌండ్స్‌లో జరిగిన రన్‌ను మేఘా కృష్ణారెడ్డి- సుధారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు.. మహిళల ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యత చాటిచెప్పేలా సాగిన ఈ కార్యక్రమంలో 10K రన్‌ను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. మెయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ సీజన్ 3.O కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

1 / 5
పింక్ పవర్ రన్ 3.0లోని ప్రతి ఒక్క విభాగం - 21K, 10K, 5K, 3K - ఇప్పుడు ట్రాక్‌లపైకి వచ్చాయి. ఈ రోజు ఉదయం అద్భుతమైన జెండా ఊపు కార్యక్రమాలతో వేలాది మంది ప్రజలు అసమానమైన శక్తితో ఒకచోట చేరారు. హెచ్‌ఎమ్‌డిఎ మైదానం పూర్తిగా గులాబీ రంగు సముద్రంగా మారిపోయింది.

2 / 5
ఫిట్‌నెస్, నివారణ ఆరోగ్య సంరక్షణ,  రొమ్ము క్యాన్సర్ అవగాహనను ప్రోత్సహించాలనే ఒకే లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతుండటంతో, ఇది ఒక అద్భుతమైన దృశ్యం.బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో సుధారెడ్డి ఫౌండేషన్‌, మెయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ సీజన్ 3.O కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

3 / 5

HMDA గ్రౌండ్స్‌లో జరిగిన రన్‌ను మేఘా కృష్ణారెడ్డి- సుధారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు.. మహిళల ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యత చాటిచెప్పేలా సాగిన ఈ కార్యక్రమంలో 10K రన్‌ను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. అనంతరం విజేతలకు అవార్డులు ప్రధానం చేశారు కృష్ణారెడ్డి.

4 / 5

పింక్ పవర్ రన్ సీజన్ 3.0 ప్రోగ్రామ్‌కి మంత్రి సీతక్క, వ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ఉత్సాహంగా ఉల్లాసంగా రన్‌లో పాల్గొన్నారు.

5 / 5
 సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థపకురాలు క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలవాలని.. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని  సూచించారు. గెలిచిన యువతి యువకులకు రూ.75 లక్షల భారీ ప్రైజ్ పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. మొత్తం 20, 000 మంది పాల్గొన్నారు. నమోదు చేసుకున్న రన్నర్లకు బిబ్, రన్ కిట్, బ్యాగ్ వంటివి అందజేస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us