
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం మంచివి తింటూ ఉండాలి వాటిలో ఈ పాయసం బెస్ట్, ఇది మీరు ఆహారంలో చేర్చుకుంటే వంద ఏనుగుల శక్తి వస్తుంది. పాత కాలంలో దీనిని ఎక్కువగా తినేవాళ్లు. ఈ తీపి వంటకం మీరు తింటే 100 ఏళ్ళు బలంతో పాటు రోజంతా శక్తిని ఇస్తుంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

పూల్ మఖానా పాయసానికి కావలసిన పదార్థాలు: ఐదు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 బాదంపప్పులు , ఒక లీటర్ పాలు, నాలుగు కప్పులు పూల్ మఖానా , కప్పున్నర బెల్లం ముక్కలు, 10 పిస్తా పప్పులు, 10 జీడిపప్పు , 10 కిస్మిస్, ఒక టేబుల్ స్పూన్ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు , ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమును దీనిలో వేసుకోవాలి.

పూల్ మఖానా పాయసం తయారి విధానం: ముందుగా మీడియం సైజ్ పాన్ పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసి ఆ తరవాత పూల్ మఖానాను తీసుకుని 10 నిమిషాల పాటు వేయించాలి ఆ తర్వాత వీటిని చల్లారనివ్వాలి. వాటిలో రెండు కప్పుల మఖానాను మిక్సీ పట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకుని దానిలో పాలు పోసి మరిగించాలి.

పూల్ మఖానా పాయసం తయారి విధానం స్టెప్ 1 : పాలు మరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మఖానా, ఆ తరవాత పొడి చేసిన మఖానాను వేసి ఉడికించాలి ఇవి బాగా మెత్తబడే వరకు 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరవాత బెల్లం కూడా వేసి కలపాలి. దీనిలో బాదం, పిస్తా, కిస్మిస్‌ను కూడా వేయించి ఈ పాయసంలో కలపాలి.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)