
ఈజిప్షియన్ కాలి వేళ్ల వ్యక్తిత్వం: ఒక వ్యక్తి కాలి బొటనవేలు మిగిలిన వేళ్ల కంటే పెద్దదిగా ఉంటే, అలాంటి వాటిని ఈజిప్షియన్ కాలి వేళ్లు అంటారు. ఇలాంటి వ్యక్తులు అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు. ఎప్పుడూ కొత్త కొత్తగా ఏవో ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా కంగారు పడకుండా తెలివిగా వాటిని పరిష్కరిస్తారు.ఇలాంటి వ్యక్తులు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తారు.

మాస్టర్ మల్టీటాస్కర్: ఒకవేళ మీ కాలి బొటనవేలు మిగతా వేళ్ల కంటే చిన్నదిగా ఉంటే, దాన్ని మాస్టర్ మల్టీటాస్కర్ అంటారు. ఇలాంటి కాళి వేళ్లు ఉన్న వ్యక్తులు టైం విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. ఏదైనా పని పెట్టుకుంటే దాన్ని అనుకున్న టైంలోనే కచ్చితంగా పూర్తి చేస్తారు.వీరు ప్రతి పనిని పక్కా ప్రణాళికతో.. టార్గెట్ పెట్టుకొని చేస్తారు.

గ్రీక్ కాలి వేళ్ల వ్యక్తిత్వం: మీ కాలి రెండవ వేలు బొటనవేలు కంటే పొడవుగా ఉంటే, దానిని గ్రీక్ కాలి వేళ్లు అంటారు. ఇలాంటి వేళ్లు ఉన్న వ్యక్తులు.. మహత్వాకాంక్ష, సృజనాత్మకత, శక్తివంతంగా ఉంటారు. వీళ్లు ఎప్పుడూ యాక్టీవ్‌గా క్రియాశీలక వ్యక్తిత్వం అవాట్లను కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా సరదాగా అందిరితో ఈజీగా కలిసిపోయేలా ఉంటారు. అలాగే ఏ పనైన తమ ఇష్టప్రకారమే జరగాలని కోరుకుంటారు. అదే బొటకనవేలు కంటే రెండో వేలు చిన్నగా ఉంటే ఇలాంటి వ్యక్తులు చాలా దయ కలిగి ఉంటారు. పక్కవారికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అందరితో ప్రేమగా మెలుగుతారు.

రోమన్ కాలి వేళ్ల వ్యక్తిత్వం: మీ కాలి మూడవ వేలు పొడవు రెండవ వేలు, బొటనవేలుతో సమానంగా ఉంటే, దాన్ని రోమన్ కాలి వేళ్లు అంటారు. ఇలాంటి చాలా క్రియాశీలంగా ఉంటారు, కాబట్టి వీరు ఈజీగా అందరికీ నచ్చుతారు. వీరు చూడ్డానికి ఇంట్రోవర్ట్‌గా కనిపించినా సామాజికంగా అందరితో కలిసిపోతారు. పక్కవారు చెప్పే మాటలను వీరు శ్రద్ధగా వింటారు. వీళ్లు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అదే మీ మూడవ వేలు ఇతర కాలి వేళ్ల కంటే చిన్నదిగా ఉంటే, ఇలాంటి వ్యక్తులు కష్టమైన పనుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. తమ పనిని వేరొకరు చేయాలని కోరుకుంటారు.

అదే మీ కాలి చిటికెన వేలు పొడవుగా ఉంటే ఇలాంటి వ్యక్తులు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే ఎక్కువ కష్టపడకుండా సరదాగా గడపాలని చూస్తారు. అదే మీది చిన్న చిటికెన వేలు అయితే, ఇలాంటి వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ప్రజలపై వీరి ప్రభావం చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు వారి సామర్థం గురించి వారికే తెలియదు. కానీ వీళ్లు అందరికీ నచ్చుతారు.Note: పైన ఆర్టికల్ పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.