
ఇంట్లో బాగా పని చేసేవాళ్లు తప్పక తినాల్సిన రవ్వ లడ్డులు.. ఇవి ఒకసారి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయ్ ఈ లడ్డులనూ కేవలం 20 నిమిషాల్లోనే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ,మరి అస్సలు లేట్ చేయకుండా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: నాలుగు కప్పుల బొంబాయి రవ్వ, కొబ్బరి తురుము, మూడు కప్పుల పంచదార , మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, కప్పున్నర పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 బాదం పప్పు, 10 కిస్మిస్, నాలుగు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. చివర్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కలపాలి.

రవ్వ లడ్డు తయారీ విధానం: ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకుని బాగా వేయించుకోవాలి. గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి బాగా వేడి చెయ్యాలి ఆ తర్వాత దీనిలో బాదం పప్పులు, 10 కిస్మిస్ లు వేసి వేయించి వీటిని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రవ్వను కూడా వేయించుకోవాలి.

మళ్ళీ కొత్త పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి బొంబాయి రవ్వను కూడా వేసి, సువాసన వచ్చే వరకు మీడియం మంటపై ఉంచి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఆ తర్వాత పాకం మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఇక దీనిలో వేయించిన పంచదార కూడా వేసి బాగా కలపాలి.

అలాగే పంచదార మొత్తం కరిగిన తర్వాత, రవ్వ, యాలకుల పొడిని వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఇప్పుడు పాలు పోస్తూ ఉండలు కలుపుకుని ప్లేట్ లో పెట్టుకోవడమే. చివర్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కలపాలి. ఇదో వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకుని వీటిని చిన్న లడ్డులుగా చేసుకోవాలి.