
బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, అర కప్పు కొత్తిమీర, నాలుగు బాదంలు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకోవాలి.

పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ తయారీ విధానం స్టెప్ 1: ముందుగా పల్లీలను తీసుకుని వాటిని ఆయిల్ లేకుండా పొయ్యి మీద వేయించాలి. ఆ తర్వాత దీనిలో వేయించిన పల్లీలను ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇంకా ఒక ఉల్లిపాయ, రెండు టమాటా, ఇంకా మూడు పచ్చిమిర్చిని తీసుకుని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.

పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ తయారీ విధానం స్టెప్ 2 : ఒక చిన్న గిన్నెలో పల్లీలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మూడు టమాటా, నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. కొత్తిమీరను సన్నగా తరిగి మిశ్రమంలో కలపాలి.

పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ తయారీ విధానం స్టెప్ 3 : మీకు ఇంకా కావాలి అనుకుంటే దీనిలో బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలో నిమ్మరసం కలిపితే ఎంతో టేస్టీగా ఉంటుంది. మొక్కజొన్న ఉంటే అవి కూడా మంచిగా కలుపుకోవచ్చు. సాయంకాలం స్నాక్‌గా తీసుకుంటే మంచిది.