జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. అన్నం, చపాతీల్లోకి అద్దిరిపోతుంది!

Updated on: Sep 05, 2026 | 8:30 PM

పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్లు వంటి బోలెడన్ని పోషకాలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే సాధారణంగా వండినప్పుడు వచ్చే పసరు వాసన వల్ల చాలామంది పిల్లలు, పెద్దలు పాలకూర కూరను తినడానికి వెనుకాడతారు. కానీ పల్లెటూరి పద్ధతిలో ముందుగానే పాలకూరను వెల్లుల్లి, ఎండుమిర్చితో నూనెలో దోరగా మగ్గించి, ఆ తర్వాత ఉల్లిపాయ-టమాటా గ్రేవీలో కలిపి వండితే వచ్చే కమ్మదనం మాటల్లో చెప్పలేనిది. 

1 / 5
కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన తాజా పాలకూర, సన్నగా పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయ, ముక్కలుగా తరిగిన రెండు టమాటాలు, పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు,  రెండుఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టీస్పూన్ల తాలింపు గింజలు, కారం, ఒక టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ పసుపు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె.

2 / 5
ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి, ముదురు కాడలు తీసేసి సన్నగా తరగాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడయ్యాక పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, తుంచిన ఎండుమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన పాలకూరను వేసి చిన్న మంటపై నూనెలో కిందకి మీదికి తిప్పుతూ వేయించాలి.

3 / 5
వేయించడం వల్ల పాలకూరలోని పసరు వాసన పూర్తిగా పోయి, వెల్లుల్లి సువాసనతో చక్కటి కమ్మదనం వస్తుంది. ఇలా మగ్గిన పాలకూరను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక గరిటెడు నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగాక తాలింపు గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించాలి.

4 / 5
ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచిన తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. అందులోనే టమాటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి నూనె పైకి తేలే వరకు బాగా మగ్గించాలి. టమాటా గుజ్జులా మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి హై ఫ్లేమ్‌లో నీటిని బాగా తెర్లనివ్వాలి.

5 / 5
నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పాలకూరను వేసి గ్రేవీలో బాగా కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై 4 నుండి 6 నిమిషాల పాటు గ్రేవీ చిక్కబడి, గుత్తంగా మారే వరకు ఉడికించాలి. చివరగా తాజా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే పల్లెటూరి రుచుల పాలకూర గ్రేవీ కర్రీ సిద్ధం! వేడివేడి అన్నం లేదా చపాతీతో సర్వ్ చేసుకుంటే అమృతంలా ఉంటుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us