
కావలసిన పదార్థాలు: ఒక కప్పు దోశ పిండి, ఒక కట్ట పాలకూర, 10 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు , దోసెలు కాల్చడానికి తగినంత నూనెను తీసుకోవాలి. దీనిని మీరు సరైన కొలతలతో తీసుకుంటే మంచి రుచిని ఇస్తాయి.

తయారీ విధానం: ముందుగా పాలకూర పేస్ట్ తయారు చేసుకోవాలి. మీరు ముందుగా పాలకూర ఆకులను తీసుకుని వాటిని మంచిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో శుభ్రం చేసుకున్న పాలకూర ఆకులు, నాలుగు పచ్చిమిర్చి, కొంచం అల్లం ముక్కలు, జీలకర్ర వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇంకా దీనిలో నీళ్లు కూడా పోసుకోవచ్చు.

పాల కూర దోసె తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకోవాలి. మీరు రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్‌ను దోశ పిండిలో వేయాలి. దానిలో అందులో మీ టేస్ట్ కు సరిపడా ఉప్పు వేసి, ఇంకా ఈ పిండి మొత్తం దానిలో కలిసిపోయేలా ఉంచాలి. ఇంకా ఇది గరిటెతో మంచిగా మిక్స్ చేసుకోవాలి.

పాల కూర దోసె తయారీ విధానం స్టెప్ 2: దోశ వేసుకోవాలి.. ముందుగా మీరు గ్యాస్ స్టవ్ ను వెలిగించి ఆ తరువాత దాని మీద పెనం పెట్టాలి. ఈ పెనం వేడయ్యాక దీని మీద కొద్దిగా నీళ్లు చల్లి ఒక క్లాత్ తో తుడవాలి. ఇప్పుడు పాలకూర దోశ పిండిని తీసుకుని పెనం మీద వేసుకుని దీనిని పలచగా చేసుకోవాలి. అయితే, దీనిని మీడియం మంట పైనే ఉంచుకోవాలి.

పాల కూర దోసె తయారీ విధానం స్టెప్ 3 : ఇప్పుడు మీరు దోశ చుట్టూ కానీ ఇంకా దోసె పైన కొద్దిగా ఆయిల్ వేసి, మంటను మీడియంగా ఉంచి దోశ కొంచం క్రిస్పీగా అయ్యే వరకు దీనిని మంచిగా కాల్చుకోవాలి. ఇక ఇప్పుడు ఈ దోసె రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అప్పుడే అది టేస్టీగా ఉంటుంది.