
కావాల్సిన పదార్థాలు : పచ్చి మామిడికాయలు రెండు ,పంచదార రుచికి సరిపడ, నీళ్లు తగినన్ని,ఫుడ్ కలర్ గ్రీన్, కారం పొడి చిటికెడు, బ్లాక్ సాల్ట్ చిటికెడు. ఇంటిలో దొరికే వీటితో చాలా సులభంగా వేసవి తాపాన్ని తరిమికొట్టే టేస్టీ టేస్టీ పుల్ల ఐస్ క్రీమ్ తయారు చేయవచ్చును.

తయారీ విధానం : పచ్చి మామిడి ఐస్ క్రీమ్ తయారీ కోసం ముందుగా రెండు మామిడి కాయలను తీసుకోవాలి. ఇవి చాలా టేస్ట్‌గా ఉండేలా చూసుకోండి. చేదుగా, కాస్త పుల్లగా ఉండేవి తీసుకోవడం వలన ఐస్ క్రీమ్ అంత టేస్టీగా ఉండదు. అందువలన తియ్యటి పచ్చి మామిడికాయలను రెండు తీసుకోండి. వీటి పై కాడను తీసి వేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

తర్వాత వీటిని ఒక మిక్సీజార్‌లో వేసుకొని తగినంత పంచదార వేసి, నీళ్లు పోస్తూ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఈ ఐస్ క్రీమ్ మంచి రంగు రావాలి అంటే, ఇందులో కొంచెం ఫుడ్ కలర్ గ్రీన్ వేయండి. దీని వలన మంచి రంగు, టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.

ఇక మామిడి మిశ్రంలో చిటికెడు కారం, బ్లాక్ సాల్ట్ వేయండి. తర్వాత దీనిని జాలితో జిగురులాంటి మిశ్రమం వేరు చేసి, రసాన్ని వేరు చేయాలి ఈ రసాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అంచుల్లో పోయాలి. తర్వాత పైన పుల్లలు గుచ్చాలి. ఇలా చేయడం వలన ఐస్ క్రీమ్ షేప్ ఫర్ఫెక్ట్ గా వస్తుంది.

ఇక ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌ను డీ ఫ్రిజ్‌లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఉంచాలి. ఒక వేళ మీరు సాయంత్రం చేస్తే రేపు మధ్యాహ్నం వరకు ఉంచాలి. దీని వలన అవి బాగా గడ్డ కట్టి ఐస్ క్రీమ్ షేప్‌లో పర్ఫెక్ట్ గా వస్తాయి. అంతే కాకుండా మధ్యాహ్నం ఎండగా ఉన్న సమయంలో ఇంటిలోని వారందరూ ఆనందంగా తినవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి, టేస్టీ టేస్టీ పచ్చి మామిడి ఐస్ క్రీమ్.