
గానుగ ఆయిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే, పాత రోజుల్లో వీటినే ఎక్కువగా వాడేవాళ్లు. ఇక ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలిలో రక రకాల నూనెలు వస్తుంది. రిఫైన్డ్ చేసిన ప్లాస్టిక్ కవర్లలో ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి. అయితే, ఇది వరకు రోజుల్లో ఎద్దుల సాయంతోనే ఈ నూనెను తయారు చేసేవాళ్లు. మరి, ఇప్పుడు దీనిని వాడొచ్చా?

ఎద్దుల సాయంతో పల్లీలు, నువ్వుల నూనెను తయారు చేసేవాళ్లు. అప్పటి రోజుల మీద పోలిస్తే ఇప్పుడు ఎంతో మంది చిన్న దానికే మందులు వేసుకుంటున్నారు. అయితే, ఈ క్రమంలోనే మళ్లీ పాత పద్ధతులు ట్రెండ్ అవుతున్నాయి. చెక్క గానుగ నూనె మళ్ళి తళుక్కున మెరవడంతో ప్రజలు కూడా దీనిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

దీనితో ఎక్కువగా పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు వంటి నూనెలను తయారు చేస్తున్నారు. ఎందుకంటే, ఈ గానుగ నూనెలను ఆర్గానిక్ గా తయారు చేస్తారు. ఇంకా ఇవి రుచితో పాటు మంచి సువాసన కూడా ఉంటుంది. ఇది చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎందుకంటే, ఈ నూనె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

మార్కెట్‌లో దొరికే పల్లీ నూనె కిలో రూ. 180 నుంచి రూ. 200 వరకు ఉంది. కానీఎం గానుగ పట్టిన నూనె కేజీ రూ. 300 పలుకుతుంది. ఎందుకంటే, దీనిని పాతకాలపు సంప్రదాయ పద్ధతిలో చేస్తారు. ఇంకా దీనిలో వాడే పరికరాలు రోలు చెక్కతో చేసినవి కాబట్టి, పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. 10 కేజీల పల్లీలతో 4 కిలోల ఆయిల్ అవుతుంది.

మార్కెట్‌లో లభించే నూనెలో పల్లీలు మాత్రమే కాకుండా అన్ని రకాలు గింజలను వాడుతారు. వాటితోనే ఈ నూనె వస్తుంది. కానీ, గానుగ పద్ధతిలో చేస్తే తక్కువ నూనె రావడమే కాకుండా, నాణ్యమైన నూనె దొరుకుతుంది. అందుకే వీటి ధర అంత పలుకుతుంది అలాగే, దీనికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సర్టిఫికెట్ దీనికి ఇవ్వొచ్చు.