
ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక, మూడు స్పూన్ల మినపపప్పు, మూడు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి, అవి బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు సన్నని మంటపై వేయించుకోవాలి. పప్పులు, ధనియాలు, జీలకర్ర వేగిన తర్వాత, పావు స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. మెంతులు ముందుగా వేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ దశలో చేర్చడం మంచిది. ఆ తర్వాత, పొట్టు తీసిన రెండు వెల్లుల్లిపాయల రేకలను వేసి, అవి కూడా కాస్త వేగే వరకు వేయించుకోవాలి.

వెల్లుల్లి వేగిన తర్వాత, ఎనిమిది నుండి తొమ్మిది ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి సంఖ్యను సర్దుబాటు చేసుకోవచ్చు. ఆ తర్వాత, చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసి కాసేపు వేయించి, చివరగా కొద్దిగా కరివేపాకు వేసి, అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేయించిన ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.

చల్లారిన పదార్థాలను మిక్సీ జార్‌లోకి తసుకుని, మూత పెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత, కొన్ని వేడి నీళ్లను పోసి, మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల నీళ్లు వేయకపోతే పేస్ట్‌గా మారదు, అందువల్ల వేడినీళ్లు ఉపయోగించడం ముఖ్యం. గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ను పక్కన పెట్టుకోవాలి.

మరలా స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేయాలి. ఈ చట్నీకి నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపపప్పు వేసి, అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత, ఒక ఎండుమిర్చిని కట్ చేసి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి.

పోపు బాగా వేగిన తర్వాత, ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పోపులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారి, లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి.ఉల్లిపాయలు వేగిన తర్వాత, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి పేస్ట్‌ను ఇందులో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి, స్టవ్‌ను సిమ్‌లో పెట్టి, పచ్చడిని ఉల్లిపాయ ముక్కలతో బాగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా అనిపిస్తే, మరికొన్ని వేడినీళ్లు కలుపుకోవచ్చు. పచ్చడిలో నుండి నూనె పైకి తేలే వరకు, మధ్యమధ్యలో కలుపుతూ సుమారు రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. పచ్చడి చల్లారిన తర్వాత, గాజు సీసాలో కానీ, గాలి చొరబడని డబ్బాలో కానీ నిల్వ చేసుకుంటే, వారం రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టకపోయినా చెడిపోదు.