Oats Laddu: ఫిజికల్ ఎనర్జీ కోసం పంచదార లేకుండా బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ మిక్స్‌డ్ సీడ్స్ లడ్డు

Updated on: Oct 04, 2026 | 12:11 PM

హాఫ్ ఇయర్లీ లేదా వార్షిక పరీక్షల సమయంలో పిల్లలు గంటల తరబడి చదువుతూ మానసికంగా, శారీరకంగా తీవ్ర అలసటకు గురవుతుంటారు. ఆ సమయంలో వారికి తక్షణ శక్తినిచ్చే చిరుతిళ్లు అవసరమవుతాయి. అయితే చాలామంది బయట దొరికే బిస్కెట్లు, చిప్స్ లేదా ప్యాక్డ్ స్నాక్స్ ఇస్తుంటారు; ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాంటి వాటికి బదులుగా ఇంట్లోనే రోల్డ్ ఓట్స్, సూపర్ సీడ్స్ మరియు బెల్లంతో ఈ లడ్డు చేసి పెడితే.. ఓట్స్ స్లోగా, స్థిరంగా శరీరానికి శక్తిని విడుదల చేస్తూ పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి.

1 / 5
కావలసిన పదార్థాలు:  1 కప్పు రోల్డ్ ఓట్స్, పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ గుమ్మడి గింజలు, పావు కప్పు కంటే తక్కువ పుచ్చగింజలు, 25 గ్రాముల అవిసె గింజలు, 25 గ్రాముల తెల్ల నువ్వులు, 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 2 యాలకులు, 1 కప్పు బెల్లం తురుము, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు

2 / 5
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి ఒక కప్పు రోల్డ్ ఓట్స్ వేసి లో-మీడియం మంటపై మాడిపోకుండా మంచి కమ్మటి సువాసన వచ్చే వరకు కలుపుతూ వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, అవిసె గింజలు మరియు నువ్వులు వేయాలి. గింజల్లోని పోషకాలు నశించకుండా ఉండేందుకు తక్కువ మంటపైనే నిదానంగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. చివరగా 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
చల్లారిన ఓట్స్‌ను మిక్సీ జార్‌లో 2 యాలకులతో కలిపి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసి బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో వేయించిన సీడ్స్ వేయాలి. గార్నిషింగ్ కోసం ఒక చెంచా సీడ్స్ పక్కన ఉంచుకోవాలి. సీడ్స్‌ను కొద్దిగా పలుకులుగా బ్లెండ్ చేసి, అందులోంచి 2 స్పూన్ల కచ్చాపచ్చా పొడిని వేరుగా తీసి పక్కన పెట్టాలి. లడ్డు తింటున్నప్పుడు క్రంచీగా తగలడం కోసం. మిగిలిన సీడ్స్ పొడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

4 / 5
పాన్‌లో ఒక కప్పు బెల్లం తురుము, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కరిగించాలి. నలకలు ఉంటే వడకట్టి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి లేత తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి. వేళ్ల మధ్య తాకి చూస్తే తీగలా సాగాలి. తీగపాకం రాగానే మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టాలి. ఇందులో మెత్తటి సీడ్స్ పౌడర్, కచ్చాపచ్చాగా ఉంచిన సీడ్స్ పొడి, వేయించిన కొబ్బరి పొడి వేసి కలపాలి. ఆ వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్‌ను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా వేగంగా కలుపుకోవాలి. పిండి అంతా బెల్లంలో కలిసిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.

5 / 5
మిశ్రమం చేత్తో ముట్టుకోగలిగే గోరువెచ్చని వేడికి రాగానే.. చేతిలో కొద్దిగా పక్కన ఉంచిన సీడ్స్ పలుకులు వేసుకుని లడ్డూల్లా చుట్టుకుంటే పైభాగం సీడ్స్‌తో అందంగా అతుక్కుంటుంది. ఈ కొలతలతో సుమారు 15 లడ్డూలు వస్తాయి. పిల్లలు చదువుకునేటప్పుడు రోజుకో లడ్డు తిన్నా అపారమైన మానసిక ఉల్లాసం, జ్ఞాపకశక్తి, శారీరక దృఢత్వం లభిస్తాయి!

Loading...
Unable to load recommendations.
Follow Us