Lungs Cancer: స్మోకింగ్‌ మాత్రమేకాదు.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వీటి వల్ల కూడా వస్తుంది!

Updated on: Aug 20, 2025 | 2:30 PM

ధూమపానం, పొగాకు వినియోగం మాత్రమే కాదు అనేక ఇతర అంశాలు కూడా ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతాయట. ముఖ్యంగా కలుషితమైన గాలికి నిరంతరం గురికావడం వల్ల ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. 2.5 ppm కంటే ఎక్కువ కాలుష్య స్థాయిలు ఉన్న నగరాల్లో నివసించే వారికి ఊపిరితిత్తుల..

1 / 5
ధూమపానం వంటి పొగాకు ఉత్పత్తుల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ధూమపానం, పొగాకు వినియోగం మాత్రమే కాదు అనేక ఇతర అంశాలు కూడా ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతాయట. ముఖ్యంగా కలుషితమైన గాలికి నిరంతరం గురికావడం వల్ల ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. 2.5 ppm కంటే ఎక్కువ కాలుష్య స్థాయిలు ఉన్న నగరాల్లో నివసించే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

2 / 5
అధిక దుమ్ము ధూళి ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది. దుమ్ము ధూళికి నిరంతరం గురికావడం వల్ల ఊపిరితిత్తుల కణజాలంలో దుమ్ము కణాలు పేరుకుపోతాయి. ఇది వాయుమార్గాలను దెబ్బతీస్తుంది. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్‌ ధరించడం మంచిది.

3 / 5
విష వాయువులు, క్లోరిన్, డీజిల్ పొగలు, బెంజీన్ పొగలకు నిరంతరం గురికావడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. ఇవి ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తాయి. నాణ్యత లేని ఆహారం, వ్యాయామం లేకపోవడం, క్షయ, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఊపిరితిత్తుల అనారోగ్యానికి దోహదం చేస్తాయి. వీటివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

4 / 5
కొంతమందికి వారసత్వంగా ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. ఈ అంశాల వల్ల ధూమపానం చేయకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధిలో అనువంశికత అంటే కుటుంబంలో ఎవరికైనా ఇంటే వారి వంశంలోని ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

5 / 5
సోడియం అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అవును.. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతాయి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజుకు 2300 మి.గ్రా కంటే ఎక్కువ సోడియం తీసుకోవడం మానుకోవాలి. మీరు ధూమపానం చేయకపోయినా మీ చుట్టూ ఉన్న ఎవరైనా ధూమపానం చేసినా ఆ పొగ మీ శరీరంలోకి ప్రవేశిస్తే మీ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.