
కావాల్సిన పదార్దాలు : పావు కిలో కోడి లివర్, 4 ఉల్లిపాయలు, మూడు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటిన్నర స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ ధనియాల పౌడర్, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, అర కప్పు నూనెను తీసుకోవాలి.

ముందుగా కోడి లివర్‌ను తీసుకుని బాగా శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో ఆయిల్ వేసి కరివేపాకు ఆకులు , కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి.

ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు వేసి వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి.

ఆ తర్వాత దానిలో కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని బాగా కలపాలి. మీరు మసాలా పొడులు వేసేటప్పుడు కొంచం తగ్గించి వేసుకోవాలి.

ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడి లివర్ ముక్కలు వేసి కలిపి పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో గరం మసాలా పొడి , అర కట్ట కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. ఈ టేస్టీ కర్రీని వేడి వేడి అన్నం లేదా రోటీలతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.