డ్రై క్లీనింగ్ ఖర్చు అవసరం లేదు.. పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!

Updated on: May 24, 2026 | 4:50 PM

పట్టుచీరలు (Silk Sarees) చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ప్రతిసారీ డ్రై క్లీనింగ్‌కు పంపడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే, కొన్ని సులభమైన చిట్కాలతో పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా శుభ్రం చేసుకోవచ్చు. ఖర్చులేని ఇలాంటి ఇంటి చిట్కాలతో పట్టుచీరల మెరుపును ఎప్పటికీ కాపాడుకోవచ్చు. మరేందుకు ఆలస్యం పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లిపోదాం..

1 / 5
పండుగలు, పెళ్లిళ్లు లేదా ప్రత్యేక సందర్భాలలో మహిళలు పట్టుచీరలు (Silk Sarees) ధరించడానికి ఎంతగానో ఇష్టపడతారు. పట్టుచీరలు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే, వీటిని మెయింటైన్ చేయడం అంతే కష్టమైన పని. కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా చీర పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే చాలా మంది వీటిని డ్రై క్లీనింగ్‌కు ఇస్తుంటారు. కానీ, ప్రతిసారీ డ్రై క్లీనింగ్‌కు ఇవ్వడం వల్ల జేబుకు చిల్లు పడుతుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పట్టుచీరలను ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

2 / 5
కలర్ టెస్ట్ (Color Test) ముఖ్యం: పట్టుచీరను పూర్తిగా ఉతకడానికి ముందు, దాని రంగు పోతుందో లేదో పరీక్షించడం చాలా ముఖ్యం. చీరలోని ఏదైనా ఒక చిన్న మూలను లేదా కొంగు భాగాన్ని నీటిలో ముంచి చూడాలి. ఒకవేళ రంగు వదులుతుంటే, దానిని ఇంట్లో ఉతకకుండా డ్రై క్లీనింగ్‌కే పంపడం మంచిది. రంగు పోకపోతే ఇంట్లోనే ఉతుక్కోవచ్చు.

3 / 5
చల్లని నీరు, మైల్డ్ డిటర్జెంట్: పట్టుచీరలను ఉతకడానికి ఎప్పుడూ వేడి నీటిని ఉపయోగించకూడదు. కేవలం చల్లని నీటిని మాత్రమే వాడాలి. సాధారణ డిటర్జెంట్ పౌడర్లకు బదులుగా సిల్క్ దుస్తుల కోసం ప్రత్యేకంగా వచ్చే లిక్విడ్ డిటర్జెంట్ లేదా బేబీ షాంపూను ఉపయోగించడం మంచిది. షాంపూ కలిపిన నీటిలో చీరను కేవలం 5 నుండి 10 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి. ఎక్కువసేపు నీటిలో ఉంచితే పట్టు దారాలు బలహీనపడతాయి.

4 / 5
గట్టిగా పిండకూడదు: చీరను ఉతికేటప్పుడు బ్రష్‌లు వాడటం లేదా గట్టిగా రుద్దడం వంటివి అస్సలు చేయకూడదు. అలాగే, నీటిని నైలాన్ దుస్తుల్లాగా గట్టిగా పిండకూడదు. కాటన్ టవల్‌పై చీరను పరిచి, అదనపు నీటిని టవల్ పీల్చుకునేలా చేయాలి. లేదంటే పట్టుదారాలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది.

5 / 5
నీడలోనే ఆరబెట్టాలి: పట్టుచీరలను ఎప్పుడూ నేరుగా తీవ్రమైన ఎండలో ఆరబెట్టకూడదు. ఎండ వేడిమికి పట్టు రంగు వెలిసిపోతుంది. కాబట్టి, గాలి తగిలే నీడ పట్టున మాత్రమే ఆరబెట్టాలి. అలాగే ఐరన్ చేసేటప్పుడు కూడా చీరపై ఒక కాటన్ గుడ్డను వేసి, తక్కువ వేడితో (Silk Mode) ఇస్త్రీ చేయాలి. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే మీ పట్టుచీరలు ఎప్పటికీ కొత్తవాటిలా మెరుస్తూనే ఉంటాయి, అలాగే మీ డ్రై క్లీనింగ్ ఖర్చులు కూడా తప్పుతాయి.

Follow Us