
ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదు: బంగాళదుంపలను వండకముందే ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని పిండిపదార్థం వేగంగా చక్కెరగా మారిపోతుంది. దీనివల్ల వండినప్పుడు రుచి మారడమే కాకుండా శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే వీటిని ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి.

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో బంగాళదుంప చాలా ముఖ్యమైనవి. అయితే వేసవిలో బంగాళదుంపలను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. బంగాళదుంపలను పూర్తిగా మానుకోవడానికి బదులుగా వాటిని సరైన పద్ధతిలో తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

జీర్ణ సమస్యలు వస్తాయి: కొందరికి సమ్మర్లో బంగాళాదుంపలు తింటే కడుపునొప్పి,గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు.

ఫ్రై కూరలు తినడం తగ్గించాలి: సమ్మర్లో బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడు సార్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అంతర్గత వేడి పెరిగి, అసౌకర్యానికి దారితీయవచ్చు. అందుకే వేసవిలో బంగాళాదుంపలు తిన్న తర్వాత కొంతమందికి గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ విధమైన జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే బంగాళాదుంపలను మితంగా తీసుకోవాలి.