Egg Chukauni: 10 నిమిషాల్లో చేసుకునే కమ్మనైన నేపాలీ ఎగ్ కర్రీ.. వేడి అన్నంలో తింటే అమృతమే!

Updated on: Aug 22, 2026 | 4:18 PM

ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మసాలా కూరలు తినడం వల్ల అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు శరీరానికి చలువ చేస్తూ, నాలుకకు ఎంతో కమ్మటి రుచిని అందించే వంటకాలు చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నేపాల్‌లో ఎంతో ఫేమస్ అయిన 'ఎగ్ చుక్కాని'  దీనికి చక్కటి ఉదాహరణ. ఇది నేపాల్ నేపాల్ దేశానికి చెందిన ఒక ప్రసిద్ధ సాంప్రదాయ వంటకం.

1 / 5
ఈ  ఎగ్ చుక్కాని' నేపాల్ దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా తినే ఒక  సాంప్రదాయ వంటకం. దీన్ని చిక్కటి తోడుపెట్టిన పెరుగు, ఉడికించిన కోడిగుడ్లు, సువాసనభరితమైన పోపుతో చేసే ఈ వంటకం ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. వేడివేడి అన్నం, చద్దన్నం లేదా రోటీల్లోకి అద్భుతంగా సరిపోయే ఈ స్పెషల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

2 / 5
దీన్ని తయారు చేయడానికి  కావలసిన పదార్థాలు  అర లీటర్ పాలతో తోడుపెట్టిన తాజా చిక్కటి పెరుగు, మూడు కోడిగుడ్లు, రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, గుప్పెడు తాజా కొత్తిమీర, రెండు నుండి మూడు స్పూన్లు నూనె, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఒక స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు.

3 / 5
ఎగ్ చుక్కాని తయారీ విధానం: ముందుగా మూడు కోడిగుడ్లను నీళ్లలో వేసి సుమారు 10 నిమిషాల పాటు గట్టిగా ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికిన తర్వాత చల్లటి నీళ్లలో వేసి పొట్టు వలిచి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ గుడ్లను నిలువుగా రెండు సమభాగాలుగా కట్ చేసుకోవాలి. రెండు ఉల్లిపాయలను, రెండు పచ్చిమిరపకాయలను చాలా సన్నని ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా ఉంటే పెరుగులో అంత బాగా కలిసి తింటున్నప్పుడు మంచి రుచినిస్తాయి.

4 / 5
ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్‌లోకి గడ్డ పెరుగును తీసుకోవాలి. పెరుగును గరిటతో ఉండలు లేకుండా క్రీమ్‌లా సాఫ్ట్‌గా చిలుక్కోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పెరుగు మిశ్రమంపై ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను అందంగా అమర్చుకోవాలి. స్టవ్ వెలిగించి చిన్న కడాయిలో రెండు మూడు చెంచాల నూనె వేసి వేడిచేయాలి.

5 / 5
నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. మంటను పూర్తిగా తగ్గించి ఒక స్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ ఉప్పు వేసి వెంటనే కదిలించి స్టవ్ ఆపేయాలి. కారం మాడిపోకుండా చూసుకోవాలి. ఈ వేడివేడి సువాసనభరితమైన తాలింపును నేరుగా గుడ్లు అమర్చిన పెరుగు గిన్నెపై పోసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నేపాలీ పెరుగు ఎగ్ కర్రీ క్షణాల్లో సిద్ధమవుతుంది! వేడివేడి అన్నంలో ఈ కమ్మని పెరుగు గ్రేవీ, గుడ్డు ముక్కను కలుపుకుని తింటుంటే ఒంటికి ఎంతో చలువ చేయడమే కాకుండా కడుపు నిండా తృప్తినిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us