నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది సామీ..!

Updated on: Sep 16, 2026 | 11:58 AM

నెల్లూరు అంటేనే రుచికరమైన వంటకాలకు పేరు. ఈ ప్రాంతం నుండి వచ్చిన ప్రత్యేకమైన వంటకాల్లో నెల్లూరు మినుముల పచ్చడి ఒకటి. వేడివేడి అన్నంతో, నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి రుచి అమోఘం. దీనిని తయారుచేయడం సులభమే కాదు, దీని కమ్మటి వాసన, రుచి ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వ్యాసంలో, ప్రామాణికమైన నెల్లూరు మినుముల పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో వివరంగా ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6

2 / 6
కావలసిన పదార్థాలు.. మినపప్పు: 1 టీ గ్లాసు (సుమారు 100 గ్రాములు) – పొట్టు మినపప్పు ఉపయోగిస్తే రుచి మరింత బాగుంటుంది, చింతపండు: మీడియం నిమ్మకాయ సైజు అంత ఎండుమిరపకాయలు: 12-15 (మీ కారానికి తగ్గట్టు), మెంతులు: 1/2 టీ స్పూన్, జీలకర్ర: 1/2 టీ స్పూన్, ధనియాలు: 2 టీ స్పూన్లు, ఆవాలు: 1/2 టీ స్పూన్, నూనె: 2 టీ స్పూన్లు, ఇంగువ: ఒక చిటికెడు, వెల్లుల్లి (తెల్లగడ్డ): 6-7 రెబ్బలు, ఉల్లిపాయ (ఎర్రగడ్డ): 1 మీడియం సైజు, కల్లుప్పు: తగినంత, కరివేపాకు (అవసరమైతే): ఒక రెమ్మ

3 / 6
తయారీ విధానం.. ముందుగా నిమ్మకాయ సైజు చింతపండును ఒక గిన్నెలో వేసి, అది మునిగేంతవరకు నీళ్లు పోసి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఒక పాన్ వేడి చేసి, ఒక టీ స్పూన్ నూనె వేయండి. నూనె వేడయ్యాక, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోండి. మెంతులు కొద్దిగా తక్కువగా వేయాలి, ఎక్కువైతే చేదు వస్తుంది. మసాలాలు వేగిన తర్వాత, ఎండుమిరపకాయలను తుంచి వేసి వేయించుకోండి. ఎండుమిరపకాయలు మాడకుండా జాగ్రత్తపడండి, మాడితే చేదు వస్తుంది. కావాలంటే ఈ సమయంలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయించుకోవచ్చు.

4 / 6
చివరగా, వేడికి ఒక చిటికెడు ఇంగువ వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. అదే పాన్‌లో మరో టీ స్పూన్ నూనె వేసి, మినపప్పును వేయండి. లో ఫ్లేమ్‌లో మినపప్పు బంగారు గోధుమ రంగులోకి వచ్చి కమ్మటి వాసన వచ్చేవరకు బాగా వేయించుకోండి. లోపల వరకు వేగితేనే రుచి బాగుంటుంది. వేగిన తర్వాత వెంటనే ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి, లేదంటే పాన్ వేడికి మాడిపోతుంది. వేయించిన మసాలాలు, ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లోని వాటిలో తగినంత కల్లుప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి.

5 / 6
ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును, కొద్దిగా నీటిని కలిపి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మెత్తగా గ్రైండ్ అయిన మిశ్రమంలో, వేయించి పక్కన పెట్టుకున్న మినపప్పు, వెల్లుల్లి (తెల్లగడ్డ) రెబ్బలు వేసి రెండు మూడు సార్లు పల్స్ ఇవ్వండి. పప్పు పలుకులుగా ఉండేలా చూసుకోండి, అప్పుడే తినేటప్పుడు పంటికి తగిలి మంచి రుచిని ఇస్తుంది. చివరగా, ముక్కలుగా చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ (ఎర్రగడ్డ) ముక్కలు వేసి ఒక్కసారి పల్స్ ఇవ్వండి.

6 / 6
ఉల్లిపాయ మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు. అంతే నోరూరించే నెల్లూరు మినుముల పచ్చడి సిద్ధం. దీనికి పోపు అవసరం లేదు. వేడివేడి అన్నంలో, కాస్త నెయ్యి కలుపుకొని తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. ఈ పచ్చడి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి..

Loading...
Unable to load recommendations.
Follow Us