
బీడీఎస్ (BDS - Bachelor of Dental Surgery): దంత వైద్యంలో నైపుణ్యం సాధించడానికి బీడీఎస్ ఎంతో ప్రజాదరణ పొందిన కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో దంత వైద్యునిగా చేరవచ్చు లేదా సొంతంగా క్లినిక్ ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఎండీఎస్ (MDS) చేయడం ద్వారా మరింత స్పెషలైజేషన్ సాధించవచ్చు.

బీఏఎంఎస్ (BAMS - Bachelor of Ayurvedic Medicine and Surgery): ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్య విధానానికి ఆదరణ వేగంగా పెరుగుతోంది. బీఏఎంఎస్ పూర్తి చేసిన విద్యార్థులు ఆయుర్వేద డాక్టర్లుగా సేవలందించవచ్చు. అలాగే వెల్నెస్ సెంటర్లు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, ప్రభుత్వ ఆరోగ్య శాఖలలో మంచి అవకాశాలు లభిస్తాయి.

బీహెచ్ఎంఎస్ (BHMS - Bachelor of Homeopathic Medicine and Surgery): దేశవ్యాప్తంగా హోమియోపతి వైద్య పద్ధతికి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించడంతో పాటు ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

బీపీటీ (BPT - Bachelor of Physiotherapy): ఆధునిక జీవనశైలి, క్రీడా గాయాలు, ఆర్థోపెడిక్ సమస్యలు పెరుగుతుండటంతో ఫిజియోథెరపిస్టుల ప్రాధాన్యత పెరిగింది. బీపీటీ పూర్తి చేసిన వారికి ఆసుపత్రులు, స్పోర్ట్స్ అకాడమీలు, ఫిట్‌నెస్ సెంటర్లు, రిహాబిలిటేషన్ సెంటర్లలో మంచి ఉపాధి లభిస్తుంది.

బి.ఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సులు (B.Sc Nursing & Paramedical): రోగుల సంరక్షణ, ఆధునిక వైద్య సేవల్లో నర్సింగ్, పారామెడికల్ రంగాలు అత్యంత కీలకమైనవి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రేడియోలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ వంటి కోర్సులకు భారత్‌లోనే కాకుండా విదేశాలలోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. నీట్‌లో తక్కువ మార్కులు రావడం అనేది మీ వైద్య రంగా కలలకు ముగింపు కాదు. మీ ఆసక్తి, సామర్థ్యాలకు తగినట్లుగా సరైన కోర్సును ఎంచుకుని సరైన దిశలో శ్రమిస్తే, హెల్త్‌కేర్ రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు.