
ఒకసారి దోమలు ఇంట్లోకి ప్రవేశిస్తే, అవి అంత త్వరగా బయటకు వెళ్లవు. కానీ మీరు ఈ కింది ఇంటి చిట్కాలను పాటిస్తే, దోమలు వెంటనే మీ ఇంటి నుండి పారిపోతాయి. దీనికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. వేసవిలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట దోమలు ఇంట్లోకి ఎక్కువగా రావడం మొదలుపెడతాయి. రాత్రి చీకట్లో దోమలు ఎక్కువగా కుడతాయి. కొన్నిసార్లు ఈ దోమల వల్ల నిద్ర కూడా పోలేరు. ఇంట్లో దోమలను వదిలించుకోవడానికి చాలా మంది రకరకాల పద్ధతులు ప్రయత్నిస్తుంటారు. అయినా కూడా దోమలు ఇంటిని వదలవు.

కొంతమంది రకరకాల ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. ఈ చిట్కాలలో కొన్నింటి వల్ల దోమలు ఒకటి రెండు రోజుల పాటు మాయమవుతాయి. కానీ మూడవ రోజున దోమలు మళ్లీ గుంపులు గుంపులుగా రావడం మొదలుపెడతాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక ఇంటి చిట్కా మీకు ఎంతగానో సహాయపడుతుంది.

పైగా ఈ చిట్కా అంత ఖరీదైనది కూడా కాదు. ఈ చిట్కాను ఇంట్లోనే పాటించవచ్చు. మీ ఇంటి కిటికీలో కొద్దిగా ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఒక పుదీనా లేదా తులసి మొక్కను కుండీలో నాటండి. ఈ రెండు మొక్కల ఆకుల నుంచి వెలువడే సువాసన దోమలకు నచ్చదు.

పుదీనా ఆకుల నుంచి తయారుచేసిన ద్రావణాన్ని మీ ఇంటి తలుపులపై చల్లితే, దోమలు ఇంట్లోకి రావు. ఇంట్లోకి ప్రవేశించే వీటి సంఖ్య దోమల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ చిట్కాను పాటించడనాకి మీరు ప్రత్యేక జాగ్రత్తలు పాటించల్లిసన అవసరం ఉండదు. అలాగే ఎలాంటి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు.

ప్రతి ఇంటి పూజగదిలో కర్పూరం తప్పకుండా ఉంటుంది. పూజ కోసం ఉపయోగించే ఈ కర్పూరంతో దోమలను సులభంగా తరిమికొట్టొచ్చట. ఎలాగంటే సాయంత్రం పూట డోర్లు, కిటికీలు వేసేయాలి. ఆ తర్వాత కర్పూరం, ఎండిపోయిన వేపాకులు కొన్ని తీసుకుని రెండింటినీ కలిపి 10 నిమిషాలు ఇల్లంతా పొగవేయాలి. ఈ పొగకు దోమలు ఇంట్లోకి రావట. ఒకవేళ ఎండిన వేపాకులు లేకపోయినా కర్పూరంతో పొగ వేసి ఇల్లంతా తిప్పితే దోమలు పారిపోతాయట.