
నల్ల కారంపొడికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు నల్ల నువ్వులు, ఒక కప్పు మినప్పప్పు, పావు కప్పు శనగపప్పు , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ మిరియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు , మూడు కరివేపాకు ఆకులు, 10 ఎండు మిర్చి, కొద్దిగా చింతపండు , రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.

నల్ల కారం పొడి తయారి విధానం: ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నల్ల నువ్వులను వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. ఇంకా నువ్వులు బాగా వేగిన తరవాత చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇవి బాగా చల్లారనివ్వాలి. అదే పాన్ లో మినప్పప్పు, శనగపప్పు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి.

అర టేబుల్ స్పూన్స్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు మిరియాలు, నాలుగు ఎండు మిర్చిని వేసి బాగా వేయించాలి. వీటిని ఎక్కువగా వేయిస్తే చేదు వస్తుంది కాబట్టి కొద్దీ సేపు మాత్రమే వేయించాలి. నాలుగు కరివేపాకులను వేసి తేమ పోయే వరకు వేయించాలి. వెల్లుల్లిని కూడా వేయించుకుంటే ఈ పొడి నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది.

ఇక ఇప్పుడు అన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి నాలుగు మిర్చి, మిరియాలు, నాలుగు ధనియాలు, ఇంకా జీలకర్ర కూడా వేసి పొడిలాగా చేసుకోవాలి. ఇంకా ఆ తరువాత పప్పులు, నువ్వులు, నాలుగు కరివేపాకు, నాలుగు వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా కాకుండా వీటిని గ్రైండ్ చేయాలి.

వేడి వేడి అన్నంలో ఈ పొడిని రెండు స్పూన్ల పొడి, కొద్దిగా నెయ్యిను కలిపి తినాలి. ఇంకా ఇది ఇడ్లీ, దోశలకు కూడా మంచిగా సరిపోతుంది. ఇంకా ఇది రాగి సంగటి, జొన్న రొట్టెలతో తింటే ఇది మంచిగా ఉంటుంది. ఇంకా ఈ నల్ల నువ్వుల్లో కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇంకా దీనిలో కరివేపాకు, మిరియాలు కూడా వేస్తె జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.