విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా అదిరిపోతోంది

Updated on: Oct 01, 2026 | 8:06 AM

నల్లకారం తయారీకి కారంగా ఉండే ఎండుమిరపకాయలు, ఒక కప్పు నల్ల మినపప్పు ( నల్ల మినపగుళ్ళు), ధనియాలు, జీలకర్ర, చింతపండు (కొత్త చింతపండు మంచిది), కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు, వేరుశనగ నూనె లేదా తెల్ల నువ్వుల నూనె అవసరం. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

నల్లకారం తయారీకి ముందుగా పొయ్యి వెలిగించి మందపాటి పాత్ర పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి ఎక్కనివ్వాలి.
వేడెక్కిన నూనెలో ఎండుమిరపకాయలను దోరగా, మాడిపోకుండా వేయించి ఒక పాత్రలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే నూనెలో మినపప్పును వేసి మధ్యస్థ మంటపై సగం పైచిలుకు వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి, అన్నీ కలిపి దోరగా, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. దినుసులు మాడకుండా చూసుకోవాలి, లేదంటే రుచి మారిపోతుంది.

నల్లకారం తయారీకి ముందుగా పొయ్యి వెలిగించి మందపాటి పాత్ర పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి ఎక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఎండుమిరపకాయలను దోరగా, మాడిపోకుండా వేయించి ఒక పాత్రలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మినపప్పును వేసి మధ్యస్థ మంటపై సగం పైచిలుకు వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి, అన్నీ కలిపి దోరగా, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. దినుసులు మాడకుండా చూసుకోవాలి, లేదంటే రుచి మారిపోతుంది.

2 / 5
దినుసులు పూర్తిగా వేగిన తర్వాత, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేయించేటప్పుడు అదనంగా నూనె వేయకూడదు. కారంపొడి ముద్దగా రాకుండా పొడిపొడిగా ఉండాలంటే నూనె ఎంత అవసరమో అంతే వేసుకోవడం ముఖ్యం.
వేయించిన వాటిని పొయ్యి కట్టేసి, ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.

దినుసులు పూర్తిగా వేగిన తర్వాత, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేయించేటప్పుడు అదనంగా నూనె వేయకూడదు. కారంపొడి ముద్దగా రాకుండా పొడిపొడిగా ఉండాలంటే నూనె ఎంత అవసరమో అంతే వేసుకోవడం ముఖ్యం. వేయించిన వాటిని పొయ్యి కట్టేసి, ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.

3 / 5
వెల్లుల్లిపాయలను ఇప్పుడు వేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత, ఈ దినుసులను ఒక పొడి మిక్సీలో వేసి 90 శాతం మెత్తగా పొడి చేసుకోవాలి. 90 శాతం పొడి అయిన తర్వాత, పచ్చి వెల్లుల్లిపాయలను వేసి రెండు లేదా  మూడు తిప్పులు తిప్పాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉంటే కారం మరింత రుచికరంగా ఉంటుంది.

4 / 5
వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కారం పొడి కొద్దిగా ముద్ద కట్టినట్లు అవుతుంది. దీన్ని ఒక పాత్రలోకి తీసి, ఉండలు లేకుండా చేతితో చిదిపి, పూర్తిగా ఆరిపోయేలా పది నుంచి పదిహేను నిమిషాలు గాలికి ఉంచాలి. పూర్తిగా చల్లారిన తర్వాత, గట్టి మూత ఉన్న డబ్బాలోకి మార్చుకోవాలి. ఉప్పు రుచి చూసి అవసరమైతే సర్దుబాటు చేసుకోవచ్చు.

5 / 5

ఈ నల్లకారం అన్నంలో నూనె వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీలు, వడలు, దోసెలు, ఉతప్పాలు, మినప రొట్టెలు, గిన్నె రొట్టెలు, ఉప్పిడి పిండి, రాగి సంకటి వంటి అనేక రకాల అల్పాహారాలకు కూడా ఇది చక్కని జోడి. వర్షాకాలంలో, చలికాలంలో, జలుబు,  జ్వరాల నుండి కోలుకున్నప్పుడు నల్లకారం కలిపిన అన్నం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం, రుచి, పోషణ లభిస్తాయి. శనగపప్పు వాడలేదు కాబట్టి పత్యం చేసే వాళ్ళు  కూడా ఎటువంటి సంకోచం లేకుండా తినవచ్చు. తడి చేతులు, తడి చెంచాలు లేకుండా పొడిని నిల్వ చేస్తే, రెండు నుండి మూడు నెలల వరకు దాని సువాసన, రుచి చెక్కుచెదరకుండా ఉంటాయి. పూర్తిగా ఆరిన కరివేపాకు, వెల్లుల్లిపాయలను ఉపయోగించడం వల్ల బూజు పట్టకుండా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us