
కావాల్సిన పదార్దాలు : 5 ములక్కాడలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, పది కరివేపాకులు, రెండు టేబుల్ స్పూన్లు నూనె, కొత్తిమీర ఆకులు.

ముందుగా ములక్కాడలను తీసుకుని నీటిలో బాగా శుభ్రపరచి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని కట్ చేసి నీళ్లలో 10 నుంచి 15 నిముషాల పాటు బాగా ఉడికించాలి. ఇవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని లోపలి గుజ్జును తీసి గిన్నెలో పెట్టుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసిఅది వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు వేసి వాటిని బాగా వేయించాలి.

ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కూడావేసి రంగు మారే వరకు వరకు వాటిని బాగా వేయించాలి. ఇంకా వాటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.

ఉల్లిపాయల మిశ్రమం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు కూడా బాగా వేయించాలి. చివర్లో ములక్కాడ గుజ్జు వేసి 10 నిముషాల పాటు ఉంచి బాగా మరిగించాలి. గ్రేవీలా మారిన తర్వాత కొత్తిమీర కిందకు దించాలి.