తెల్లం బియ్యం కన్నా వీటిలో పోషకాలు ఎక్కువ.. తాతల బలం వెనుక అసలు సీక్రెట్

Updated on: Oct 01, 2026 | 11:41 AM

వరి ధాన్యాలు, చిరుధాన్యాలు రెండింటిలో ఏది తీసుకోవాలి. మనం రోజూ ఏ రకమైన ధాన్యాన్ని ఎంచుకున్నా కానీ పాలిష్ చేయని వాటిని తీసుకోవడం వలన పూర్తి పోషక ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తుంది. శక్తి, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలు వంటి పోషకాలు ఈ ధాన్యాల వలన మన శరీరానికి అందుతాయి.

1 / 5

వరి ధాన్యాలు,  చిరుధాన్యాలు మన భారతీయ ఆహార సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. తరతరాలుగా మన పెద్దలు వీటిని ప్రధాన ఆహారంగా తీసుకుంటూ, మనకు కూడా అలవాటు చేశారు. మనం వీటిని అన్నం రూపంలో, రవ్వగా లేదా పిండిగా అనేక రకాలుగా వినియోగిస్తుంటాం. ఇటీవల కాలంలో, పాలిష్ చేయని బ్రౌన్ రైస్ (ముడి బియ్యం) వివిధ రకాల చిరుధాన్యాల వినియోగం పెరిగింది. కొంతమంది ఒక రోజు వరి అన్నం తింటే, మరో రోజు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు.

2 / 5
ఇటువంటి ఆహార అలవాట్లను పాటించే వారికీ  ఈ ధాన్యాలలో సగటున లభించే పోషకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 
శక్తి (ఎనర్జీ): మనం తీసుకునే ఆహారం నుండి లభించే శక్తి కిలో క్యాలరీలలో కొలుస్తారు. వరి ధాన్యాలు , చిరుధాన్యాలు ఏ రకం తీసుకున్నా, 100 గ్రాముల ధాన్యం నుండి సగటున 340 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది.

ఇటువంటి ఆహార అలవాట్లను పాటించే వారికీ ఈ ధాన్యాలలో సగటున లభించే పోషకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. శక్తి (ఎనర్జీ): మనం తీసుకునే ఆహారం నుండి లభించే శక్తి కిలో క్యాలరీలలో కొలుస్తారు. వరి ధాన్యాలు , చిరుధాన్యాలు ఏ రకం తీసుకున్నా, 100 గ్రాముల ధాన్యం నుండి సగటున 340 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది.

3 / 5
కార్బోహైడ్రేట్లు: ఈ చిరు ధాన్యాలలో కార్బోహైడ్రేట్లు ప్రధాన పోషకాలుగా ఉంటాయి. 100 గ్రాముల వరి లేదా చిరుధాన్యాలలో సగటున 68 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలిసిపోయి, కండరాలకు, మెదడుకు ఇంధనంగా పనిచేస్తాయి. మీరు ఒక రోజు వరి, మరో రోజు చిరుధాన్యాలు తిన్నా, ఇదే పరిమాణంలో కార్బోహైడ్రేట్లు శరీరానికి అందుతాయి.

4 / 5
ప్రొటీన్లు: శరీర నిర్మాణం, కండరాల పెరుగుదల, మరమ్మత్తులకు ప్రొటీన్లు అత్యవసరం. 100 గ్రాముల ధాన్యాలలో సగటున 9.6 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి. మనం ధాన్యాలను పాలిష్ చేసినప్పుడు, అందులోని దాదాపు 80% ప్రొటీన్లు తవుడుతో పాటు తొలగిపోతాయి. కాబట్టి, ముడి ధాన్యాలను తినడం వలన మాత్రమే ఈ సగటు 9.6 గ్రాముల ప్రొటీన్‌ను పూర్తిగా పొందగలం. పాలిష్ చేసిన ధాన్యాలలో ప్రొటీన్ విలువలు తగ్గుతాయి.

5 / 5
కొవ్వులు (ఫ్యాట్స్): ధాన్యాలలో కొవ్వు పదార్థాల శాతం తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ధాన్యాలలో 2 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. పీచు పదార్థాలు (ఫైబర్): పీచు పదార్థాలు జీర్ణక్రియకు, మలబద్ధకాన్ని నివారిస్తాయి. 100 గ్రాముల ధాన్యాలలో సగటున 6.5 గ్రాముల పీచు పదార్థాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలిష్ చేయని ధాన్యాలలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి, ఇవి ప్రేగు కదలికలను మెరుగుపరచి, పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us