
మునక్కాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఇది తింటే కడుపు కూడా తేలిక పడటంతో మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇక దీని ఆకులతో కానీ , ఈ కాయలతో కానీ రొట్టెలు తీసుకుని తింటే కమ్మగా ఉంటుంది. ఇంకా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

మునక్కాయ రొట్టెలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మునక్కాయ ఆకులు పొడి, నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి.

ముందుగా మునక్కాయలను తీసుకుని బాగా ఉడికించి ఈ గుజ్జును తీసి మిక్సీ పెట్టుకోవాలి. ఆ తరవాత ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి వేసి దానిలో మునక్కాయ గుజ్జు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర ఆకులు వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు దీనిలో కొద్దిగా నీరు పోస్తూ ఈ రొట్టె పిండిని బాగా కలుపుకోవాలి. ఇంకా చివర్లో నూనె వేసి బాగా కలపాలి. పిండి కనీసం 10 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టి బాగా నాననివ్వాలి. ఆ తర్వాత ఒక్కో ముద్ద తీసుకుని రొట్టెలుగా ఒత్తుకోవాలి. ఆ తరవాత వేడి పెనం మీద ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా గోల్డ్ కలర్లోకి మారే వరకు కాల్చాలి.

ఈ మునక్కాయలో ఉండే విటమిన్ C, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి శక్తిని పెంచుతాయి. ఈ రొట్టెలు ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తాయి. ఇంకా ఇది బరువు నియంత్రణకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో రోగనిరోధక శక్తి పెరగడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.