
ఏ స్త్రీకి అయితే కుడి చెంప పై పుట్టు మచ్చ ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు. వారు ఎక్కడ ఉన్నా అక్కడ ధన ప్రవాహం ఉంటుంది. అంతే కాకుండా ఇలాంటి వారు చాలా చలాకీగా ఉంటారు. గొప్ప స్థాయిలో ఉంటారు.

అదే విధంగా ఏ అమ్మాయికి అయితే రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటుందో అమ్మాయికి అదృష్టంతో పాటు రాజయోగం కలుగుతుంది. అంతేకాకుండా రెండు కనుబొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉండే అమ్మాయిలకు పెళ్లి తర్వాత లక్కు కలిసి వచ్చి కోటీశ్వరులు అవుతారు.

నుదిటిపై కుడి వైపు పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా శుభప్రదం. ఇలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు. వీరి చేతిలో ఎప్పుడూ డబ్బే ఉంటుంది. అంతే కాకుండా వీరికి డబ్బు కొరత ఉండదు. చాలా సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు.

కుడి అరచేతిలో పుట్టు మచ్చ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. ఏ అమ్మాయిలకు అయితే కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటుందో వారు చాలాగొప్ప స్థాయిలో ఉంటారు. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. చాలా వేగంగా సంపద పెరుగుతుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు