
అయితే ఇప్పుడు మనం పుట్టు మచ్చల శాస్త్రం ప్రకారం, అమ్మాయిలకు బుగ్గపై పుట్టు మచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. అంతే కాదండోయ్.. ఇలా బుగ్గపై పుట్టమచ్చ ఉండే వారి వ్యక్తిత్వంలో ఒక పెద్ద ట్విస్ట్ ఉన్నదంట. అది ఏమిటి అంటే?

బుగ్గపై పుట్టు మచ్చ ఉండటం చాలా అదృష్టం. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అంతే కాకుండా వీరు సహజంగానే అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి మాటతీరు ప్రతి ఒక్కరినీ ఆకర్షించుకుంటుంది. తమపై ఒక విధమైన గౌరవం కలిగేలా చేస్తుంది. వీరు చాలా నిజాయితీ పరులు, ఒక్కసారి మాట ఇస్తే దానిపై ఖచ్చితంగా నిలబడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.

బుగ్గపై పుట్టమచ్చ ఉన్నవారు, ప్రేమలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. పార్టనర్‌ను రాజులా చూసుకుంటారు. అంతే కాకుండా వీరికి డబ్బు విషయంలో కూడా ఎప్పుడూ లోటు ఉండదు. లక్ష్మీకటాక్షం వీరిపైనే ఉంటుంది. వీరికి ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండదు. సొంతంగా సంపాదించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అన్నిరంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది.

ఇక బుగ్గపై పుట్టుమచ్చ ఉండే అమ్మాయిల్లో ఉండే అతి పెద్ద ట్విస్ట్ ఏమిటంటే? వీరు చూడటానికి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారు. కానీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్. వీరిది స్టీల్ లాంటి మనసు. ఎవరి మీద ఆధారపడరు. నా లైఫ్ నా ఇష్టం అనే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా బుగ్గపై పుట్టు మచ్చ ఉన్న వ్యక్తులు, చిన్నప్పుడు చాలా కష్టపడతారు.

ముఖ్యంగా వీరి మనస్తత్వం ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పే వ్యక్తిత్వం. అలాగే వీరు ఒకే ఊరిలో ఉండలేరు. ఎప్పుడూ కొత్తది నేర్చుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీరిపై చాలా మంది అసూయ ఉంటుంది. అంతే కాకుండా విదేశాలకు వెళ్లే యోగం కూడా వీరికే ఉన్నది. ఇక బుగ్గపై పుట్ట మచ్చ, ముఖ్యంగా కుడి బుగ్గపై ఉంటే భర్త, కుటుంబం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఎడమ బుగ్గపై ఉంటే సొంత కష్టం ద్వారా పేరు, డబ్బు సంపాదిస్తారు.