
రోటి పచ్చడికి , మిక్సీ పట్టిన పచ్చడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే రోటిలో నురుతారు కాబట్టి ఆ టెస్ట్ చాలా వేరుగా ఉంటుంది. ఇలాంటి రుచిని ఎవరు వదులుకుంటారు చెప్పండి. బయట కొనుక్కున్న నిల్వ పచ్చళ్ళ కంటే ఇది వంద రెట్లు బెటర్. ఇంట్లో చేసుకుని తినేవి చాలా మంచివి. ముఖ్యంగా, ఆకుకూరలు కూర కంటే ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు.

ఆకుకూరల , టమాటాలతో చేసే ఈ పచ్చడిని ప్రతి రోజు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తప్పక తినాలి అలాగే వయసైపోయిన పెద్దవాళ్ళు కూడా కనీసం వారంలో ఒక్కసారైనా దీనిని తినాలి. ఇవి ఏ సీజన్లో అయినా ఇవి దొరుకుతాయి. ఆకుకూరలు, టమాటాలు వేసి చేసే చేసే ఈ పచ్చడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఆకుకూరల రోటి పచ్చడికి కావాల్సిన పదార్దాలు : అర కట్ట పాలకూర, అర కట్ట తోటకూర, అర కట్ట చుక్కకూర , నాలుగు టమాటాలు, 100 గ్రాముల పచ్చి మిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా నూనె, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ 1 టీస్పూన్ ఆవాలు, నాలుగు ఎండు మిర్చి , 10 కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

ముందుగా ఆకుకూరలను తీసుకుని కడిగి ఆ తరవాత టమాటాలను కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ఆకుకూరలు, టమాటాలు, పచ్చి మిర్చి వేసి బాగా వేయించాలి. ఈ ఆకుకూరలు మెత్తబడిన తరవాత వాటిని నూరుకోవాలి.

చల్లారిన తర్వాత ఆకుకూరలు, నాలుగు పచ్చి మిర్చి, రెండు టమాటాలు వేసి దానిలో ఉప్పు వేసి, ఒక స్పూన్ జీలకర్ర, 10వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా పట్టుకోవాలి. చిన్న పాన్‌లో ఆయిల్ వేసి ఆ తరువాత దానిలో ఆవాలు, వెల్లుల్లి, రెండు ఎండుమిర్చి, కరివేపాకు కూడా తాలింపు దీనిలో బాగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి పచ్చడి రెడీ.