మేక కాళ్ల కూర.. ఇలా వండి తింటే.. విరిగిన ఎముకలు కూడా అతకాల్సిందే!

Updated on: Nov 09, 2026 | 11:45 AM

మేక కాళ్ల కూర రుచి ఒకసారి టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, కాల్షియం , విటమిన్స్ ఎక్కువగా ఉండటం వలన ఈ కర్రీ కండరాల బలానికి, ఎముకల బలానికి చాలా మంచిది. అందువలన ఈ మేక కాళ్ల కర్రీని చాలా రుచికరంగా ఎలా వండాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మేక కాళ్లు: 4 ,   పసుపు,   ఉప్పు,  మిరియాలు,  యాలకులు: 3-4,   లవంగాలు,   దాల్చినచెక్క: చిన్న ముక్క,  ధనియాలు: ఒక టేబుల్ స్పూన్,   జీలకర్ర: అర టీస్పూన్,   ఉల్లిపాయలు,  నూనె,  బిర్యానీ ఆకులు,  పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్,   టమాటో: 1,   కారం,  కొబ్బరి పొడి, నీళ్లు,   కొత్తిమీర.

2 / 5
తయారీలోకి వెళ్లితే.. ముందుగా మేక కాళ్లను శుభ్ర పరచాలి. దీని కోసం మేక కాళ్లను ఒక గిన్నెలోకి తీసుకుని, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు, కొద్దిగా నీళ్లు చల్లి బాగా పట్టించాలి. దీనివల్ల కాళ్లపై ఉండే మురికి, వాసన, బ్యాక్టీరియా పోతాయి. ఐదు నిమిషాలు అలా ఉంచి, ఆ తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం, మిక్సర్ జార్ లోకి మిరియాలు,  యాలకులు,  లవంగాలు, దాల్చినచెక్క, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని, అందులోనూనె వేసి వేడి చేయాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. నూనె వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు వేయాలి.ఇప్పుడు గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ దాదాపు వేగిన తర్వాత, కట్ చేసిన  పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.

4 / 5
 తర్వాత, కట్ చేసిన ఒక టమాటో వేసి, టమాటో మెత్తబడే వరకు రెండు మూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మేక కాళ్లను కుక్కర్ లో వేసి, నూనెలో రెండు మూడు నిమిషాలు బాగా వేయించాలి. ఇలా వేయించడం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది. రెండు నిమిషాల తర్వాత, మీ రుచికి తగ్గట్టు కారం, గ్రైండ్ చేసిన మసాలా పొడి, 2 టీస్పూన్ల కొబ్బరి పొడి , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

5 / 5
తర్వాత మంటను తక్కువ చేసి, కుక్కర్ మూత పెట్టి, ఉప్పు, కారం, మసాలాలు మేక కాళ్లకు బాగా పట్టేలా ఉడికించాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి బాగా కలపాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర ఆకు వేసి కలపాలి.కుక్కర్ మూత పెట్టి, హై ఫ్లేమ్‌లో 5  విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపి, కుక్కర్ లోని గాలి పూర్తిగా పోయే వరకు వేచి ఉండాలి. తర్వాత కాళ్లు ఉడికిపోయాయని తెలుస్తుంది. తర్వాత కొత్తిమీర, పూదీనా వేసి మరో పదినిమిషాలు ఉడికించుకోవాలి. అంతే మేక కాళ్ల కర్రీ రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us