కుజ, బృహస్పతి కలయిక.. వీరు నక్కతోక తొక్కినట్లే

Updated on: Oct 03, 2026 | 4:00 PM

జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాలలో కుజ, గురు గ్రహాలు చాలా కీలకమైనవి. కుజుడు బలానికి, ధైర్యానికి అధిపతి. గురుడు జ్ఞానం, సంపదకు , అదృష్టానికి అధిపతి. అయితే ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక ఏర్పడనుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుందంట.

1 / 5
కర్కాటక రాశిలో రెండు గ్రహాల మహాసయంగం ఏర్పడనుంది. కుజ, గురు గ్రహాలు రెండు కలిసినప్పుడు ఇది సంయోగం యోగం ఏర్పరుస్తుంది. అయితే దీని వలన నాలుగు రాశుల వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

2 / 5
కర్కాటక రాశి : రెండు గ్రహాల కలయిక మీ రాశిలో ఏర్పడటం వలన మీకు చాలా లాభం జరుగుతుంది.  చాలా కాలంగా ఆగిపోయిన మీ కోరికలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, మీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు జీతం పెరుగుతుంది, కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆస్తి విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి, కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం ఉంది. వ్యాపారులకు ఈ సమయం బంగారం లాంటిది.

3 / 5
తుల రాశి :తుల రాశి వారికి ఈ కుజ-గురు కలయిక కెరీర్ పరంగా పెద్ద మలుపు తీసుకొస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, ఉన్నత స్థానానికి ఎదుగుతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి విసా, ఉద్యోగం విషయంలో శుభవార్త వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం చేకూరుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు, పాత అప్పులన్నీ తీర్చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

4 / 5
 కన్యా రాశి :కన్యా రాశి వారికి ఈ యోగం ధన యోగాన్ని తీసుకొస్తుంది. లాటరీ, షేర్ మార్కెట్, పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆదాయం పెరగడమే కాకుండా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి, దీంతో పొదుపు పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు మెచ్చి బాస్ నుండి ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు లాభాలను తెస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్న అపార్థాలు తొలగి, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

5 / 5
మిథున రాశి :మిథున రాశి వారికి ఈ సమయం నిజంగా నక్కతోక తొక్కినట్లే. గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కోర్టు కేసులు, భూ వివాదాల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయం, గురుబలం వల్ల పెద్దల సహాయం లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశీ అవకాశాలను అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us