
ఈ అమ్ముడు అందానికి బ్రహ్మదేవుడే ఫిదా అయిపోతాడేమో అంతలా తన గ్లామర్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది బ్యూటీ మానుషి చిల్లర్, ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకొని, నటనపై ఉన్న ఇంట్రస్ట్‌తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

బాలీవుడ్ సామ్రాట్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. కానీ మూవీ మాత్రం హిట్ అందుకోలేకపోయింది. అయినా కూడా ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ రావడం జరిగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులు కూకుండా సినిమాలు చేసింది.

కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదు. దీంతో మెల్లి మెల్లిగా ఈ బ్యూటీ గ్రాఫ్ పడిపోయిది. ఇక తెలుగులో వరుణ్ తేజ సరసన ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ కూడా అంతగా హిట్ అవ్వకపోవడంతో ఈ అమ్మడు తెలుగు అభిమానుల మనసుదోచుకోలేకపోయింది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటిస్తూ, మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదని టాక్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్‌లో తన అందంతో అందరినీ మాయ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.