Chilli Powder Side Effects: వంటల్లో కారం దంచిపెట్టి తింటున్నారా..? యమ డేంజర్ రా బాబు..

Updated on: Jul 30, 2026 | 8:17 AM

భారతీయ వంటకాల్లో కారం, మసాలాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కారం, ఘాటైన మసాలాలు లేకపోతే చాలామందికి ముద్ద దిగదు. కొద్దిగా కారం తినడం వల్ల రుచి పెరగడమే కాకుండా జీవక్రియ మెరుగవుతుంది. కారంలో ఉండే క్యాప్సైసిన్ అనే కాంపౌండ్ జీవక్రియను వేగవంతం చేసి తాత్కాలికంగా క్యాలరీలను కరిగించడంలో సహాయపడుతుంది. అయితే, రోజూ పరిమితికి మించి అతిగా కారం, మసాలాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
నిద్రలేమి సమస్య: రాత్రివేళ భోజనంలో ఎక్కువ కారం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా కడుపులో మంట, అసిడిటీ కారణంగా రాత్రివేళ సరిగ్గా నిద్రపట్టదు. ఇది క్రమంగా నిద్రలేమి సమస్యకు దారితీసి మరుసటి రోజు అలసట, నీరసానికి కారణమవుతుంది.

2 / 5
కడుపులో మంట, అసిడిటీ, అల్సర్లు: కారం ఎక్కువైనప్పుడు కడుపులోని పొరలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీనివల్ల నిరంతరం కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట ఏర్పడతాయి. రోజుల తరబడి ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో పుండ్లు లేదా అల్సర్లు ఏర్పడి పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంది.

3 / 5
రుచి మొగ్గల సున్నితత్వం తగ్గడం: రోజూ అత్యధికంగా కారం, మసాలాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల నాలుకపై ఉండే రుచి మొగ్గలు తమ సహజమైన సున్నితత్వాన్ని కోల్పోతాయి. దీనివల్ల సాధారణ ఆహారాల రుచిని సరిగ్గా ఆస్వాదించలేరు.

4 / 5
జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, విరేచనాలు: మితిమీరిన కారం జీర్ణవ్యవస్థ తీవ్రతను పెంచుతుంది. పేగుల కదలికలు వేగవంతమై కడుపునొప్పి, వికారం, విరేచనాలు సంభవిస్తాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవారికి అధిక కారం మరింత తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది.

5 / 5
చర్మ సమస్యలు: కొందరిలో అతిగా కారం తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి ముఖంపై మొటిమలు, ఎరుపుదనం లేదా చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే, కారం పూర్తిగా మానాల్సిన అవసరం లేదు, కానీ దానిని పరిమితంగా తీసుకోవడమే ఉత్తమం. కారంతో పాటు పెరుగు, మజ్జిగ లేదా తాజా కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. కడుపులో తరచూ మంట లేదా నొప్పి ఉంటే వెంటనే కారం తగ్గించి వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

Loading...
Unable to load recommendations.
Follow Us