Washing Machine: పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేస్తే మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

Updated on: Sep 30, 2026 | 8:46 PM

ప్రస్తుత రోజుల్లో ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ సర్వసాధారణమైన ఎలక్ట్రానిక్ వస్తువుగా మారిపోయింది. రోజూ గంటల తరబడి బట్టలు ఉతికే శ్రమను తగ్గించే ఈ యంత్రం కోసం వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తాం. అయితే మెషీన్ కొన్న తర్వాత ఎక్కువమంది దృష్టి పెట్టని ఒక కీలకమైన అంశం.. అందులో వాడే డిటర్జెంట్ రకం. పౌడర్ vs లిక్విడ్.. ఏది వాడితే మంచిది..? అనే విషయం తెలుసుకుందాం..

1 / 5
దశాబ్దాలుగా మనకు సర్ఫ్ లేదా డిటర్జెంట్ పౌడర్ వాడటమే బాగా అలవాటు. కానీ ఆధునిక ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లోకి వచ్చాక సాంకేతిక నిపుణులు పౌడర్ కంటే లిక్విడ్ వాడకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్టల మన్నికతో పాటు మెషీన్ ఆరోగ్యాన్ని కాపాడటంలో లిక్విడ్ ఎందుకు మేటిగా నిలుస్తుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం.

2 / 5
బట్టలపై సబ్బు మరకలు, గరుకుదనం ఉండదు: సాధారణంగా నగరాల్లో వచ్చే ఉప్పు నీళ్లు లేదా చల్లటి నీళ్లలో డిటర్జెంట్ పౌడర్ త్వరగా, పూర్తిగా కరగదు. దీనివల్ల వాష్ సైకిల్ పూర్తయిన తర్వాత కూడా నలుపు, నీలం వంటి ముదురు రంగు దుస్తుల మీద, కాలర్ల వద్ద తెల్లటి పౌడర్ మచ్చలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఆ రసాయన కణాలు బట్టల ఫైబర్‌లలో ఉండిపోయి దుస్తులు గరుకుగా మారతాయి. అదే లిక్విడ్ డిటర్జెంట్ అయితే నీటిలో క్షణాల్లో కలిసిపోతుంది. దుస్తుల దారాల లోపలికి సులభంగా వెళ్లి మురికిని తొలగిస్తుంది తప్ప, బట్టలపై ఎలాంటి అవశేషాలను వదలదు.

3 / 5
విద్యుత్ , నీటి బిల్లు: డిటర్జెంట్ పౌడర్‌ను తొలగించడానికి వాషింగ్ మెషీన్‌కు ఎక్కువ నీరు, ఎక్కువ సమయం అవసరం అవుతాయి. బట్టలకు అంటుకున్న సబ్బు నురగ పూర్తిగా పోయేందుకు మెషీన్ అదనపు రిన్స్ , స్పిన్ సైకిల్స్‌ను రన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఎక్కువ మోతాదులో నీరు వృథా కావడంతో పాటు కరెంట్ వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుంది. లిక్విడ్ డిటర్జెంట్ తక్కువ నురుగుతో సులభంగా కొట్టుకుపోతుంది కాబట్టి, సాధారణ సైకిల్‌‌లోనే బట్టలు శుభ్రపడతాయి. ఫలితంగా సమయం, నీరు, కరెంట్ బిల్లులన్నీ ఆదా అవుతాయి.

4 / 5
డ్రమ్ రంధ్రాలు, డ్రైనేజ్ పైపులు బ్లాక్ అవ్వవు:  వాషింగ్ మెషీన్లలో తరచూ వచ్చే ప్రధాన సాంకేతిక లోపం.. నీరు బయటకు పోయే పైపులు జామ్ కావడం లేదా డ్రమ్ రంధ్రాలు మూసుకుపోవడం. పౌడర్ పూర్తిగా కరగకపోవడం వల్ల అది కాలక్రమేణా జిగురులా మారి, పైపుల లోపలి గోడలకు ఒక పొరలా పేరుకుపోతుంది. దీనివల్ల డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతిని, మెషీన్ నుంచి నీరు బయటకు వెళ్లడం కష్టమవుతుంది. ఇది అంతిమంగా వాటర్ పంప్ మరియు మోటారుపై తీవ్ర భారం మోపుతుంది. లిక్విడ్ వాడితే ఈ పేరుకుపోయే సమస్య అసలు ఉండదు.

5 / 5
మెషీన్ లోపల బ్యాక్టీరియా, దుర్వాసన రాదు: పౌడర్ అవశేషాలు డ్రమ్ అడుగు భాగంలో నిల్వ ఉండటం వల్ల కొన్నాళ్లకు బూజు, దుర్వాసన వ్యాపిస్తాయి. బట్టలు ఉతికిన తర్వాత కూడా తాజా సువాసన రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. లిక్విడ్ డిటర్జెంట్ వాడినప్పుడు డ్రమ్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది. ముందుచూపుతో ఆలోచిస్తే, డిటర్జెంట్ పౌడర్ కంటే లిక్విడ్ ధర కాస్త ఎక్కువనిపించినా.. బట్టల లైఫ్ పెరగడం, కరెంట్-నీటి బిల్లులు తగ్గడం, అన్నింటికీ మించి వేల రూపాయల మెషీన్ రిపేర్ల ఖర్చు తప్పడం వల్ల దీర్ఘకాలంలో లిక్విడ్ డిటర్జెంట్‌ను ఎంచుకోవడమే అత్యంత లాభదాయకం.

Loading...
Unable to load recommendations.
Follow Us