
ఒక్య వ్యక్తి శరీర కృతిని బట్టి, అతని వ్యక్తిత్వం గుణ గణాలు సులభంగా తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు సాముద్రిక శాస్త్ర పండితులు. అయితే కాలి వేళ్ల పొడవు, నుదురు ఇవే కాకుండా ఒక వ్యక్తి పెదవులు కూడా తన క్యారెక్టర్‌ను రివీల్ చేస్తుందంట. అది ఎలా అంటే?

సన్నని పెదవులు : సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికి అయితే చాలా సన్నని పెదవులు ఉంటాయో, వారు స్వతంత్రులుగా జీవిస్తారంట. అంతే కాకుండా వారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే ఎంత కష్టమైన పనిని అయినా సరే చేస్తారంట.

అంతే కాకుండా సన్నని పెదవులు ఉన్నవారు ఎక్కువగా ఆలోచించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వార ఇతరుల కంటే, తమ పని తాము చూసుకోవడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అంతే కాకుండా చాలా మౌనంగా ఉంటారు. కానీ ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

పెద్ద పెదువులు : ఎవరి పెదవులు అయితే లావుగా పెద్దగా ఉంటాయో, వారు చాలా కష్టపడి పని చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతే కాకుండా చాలా నిజాయితీ పరులు. వీరు ఎప్పుడూ కష్టపడి విజయం అందుకుంటారు. అలాగే మంచి మనసు కలిగి ఉంటారు. ఇతరులపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

మధ్యస్థంగా పెదవులు ఉండటం. ఇలాంటి వారు చాలా సౌమ్యులు. కాకపోతే ఎక్కువగా కష్టాలు అనుభవిస్తారు. చాలా మంచివారు, అందుకే వీరి మంచితనమే వీరిని అనేక ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తుంది. నోట్: పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ,నిపుణుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.