
ఈ రోజుల్లో ఎంతో మంది బయటకు వస్తే చాలు వై ఫై పాస్‌వర్డ్ చెబుతారా అని అడగటం చూసాము. అయితే, త్వరలో ఇది ఉండకపోవచ్చు అని అంటున్నారు. అలా అని అస్సలు వర్రీ అవ్వకండి ఈ వై ఫై ప్లేస్ లో లై-ఫై వస్తుంది. ముందు ముందు ఇవే ట్రెండ్ అవుతాయి. మీరు వింటున్నది నిజమే. మన ముందుకు త్వరలో కొత్త టెక్ టెక్నాలజీ రాబోతోంది.

ఇక మీదట ‘వై-ఫై’ కాదు ‘లై-ఫై’ వస్తుంది. ఒక చిన్న ఎల్‌ఈడీ బల్బుతో హైస్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. ఇప్పటికే మన దేశంలోని హాస్పిటల్స్ , విద్యాసంస్థలూ, బ్యాంకుల్లో కూడా ఇప్పటికే వాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మన ఇంటికీ కూడా కొద్దీ రోజుల్లోనే ఇది రావొచ్చు. ఇది ఎలా పని చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

వై-ఫైతో పోలిస్తే లై-ఫై చాలా ఫాస్ట్ గా పని చేస్తుంది. అంతేకాదు,ఒక్క సెకనులో 20 సినిమాలు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి ఇది అంత ఫాస్ట్ గా ఉంటుంది. కేవలం స్పీడ్ ఒక్కటే కాదు ఈ టెక్నాలజీని చాలా ఈజీగా వాడుకోవచ్చు. దీని కోసం ఎలాంటి పరికరాలేమీ అవసరం లేదు. చిన్న బల్బు చాలు.

ఆ బల్బు మరేదో కాదు ఎల్‌ఈడీ బల్బు చాలు. ఇంకా దీనిలోనే ఒక చిన్న మైక్రోచిప్‌ని అమర్చి, లై-ఫై ను తయారుచేస్తున్నారు. ఇక, దీన్ని వాడుకోవడం కూడా సులభం. ఎక్కువ కష్ట పడాల్సిన అవసరం లేదు. స్విచ్ ఆన్ చేస్తే చాలు వెంటనే బల్బు వెలుగుతుంది, ఇంకా మనకి కావాల్సిన డేటా దొరుకుతుంది. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి డాంగ్లర్ కావాలి.

మన ఇంట్లో ఉన్న వై-ఫైకి పాస్‌వర్డ్ కావాలి. ఇంకా జాగ్రత్తగా ఉండకకపోతే బ్యాంకు ఖాతాలు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఈ లై-ఫైలో అలా జరగడానికి అస్సలుఉండదు. ఎందుకంటే దీనిలో లైట్ మన ఇంటి గోడల లోపల మాత్రమే ఉంటుంది. దీనిని దాటి బయటకు వెళ్లదు కాబట్టి. సైబర్ నేరాలు జరిగే అవకాశాలు కూడా ఉండవు