
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు కలిసి వస్తుంది. మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి ఎప్పుడు కూడా సూర్యుడి ఆధీనంలోనే ఉంటుంది. ఇంకా కన్యా రాశి అయితే ఎప్పుడూ బుధుడి ఆధీనంలోనే ఉంటుంది. అయితే, ఈ రెండు రాశుల వారు కొన్ని పనులు చేస్తే వారికి బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇంకా వీరి జీవితంలో ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సింహ రాశి: సింహ రాశికి అధిపతి అయినా సూర్యుడు. వీరు ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే నడవాలని అనుకుంటారు. అయితే, రోజూ ఉదయాన్నే లేచి, స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే పెద్దల ఆశీస్సులు ఉంటాయి అలాగే వారికి అదృష్టం కూడా కలిసివస్తుంది. ఇంకా వీళ్ళు ఎరుపు, కుంకుమ రంగు దుస్తులు ధరించాలి.

కన్యా రాశి: కన్యా రాశికి అధిపతి బుధుడు. వీరు ఏ పని చేసినా కూడా చక్కగా చేస్తారు ఇంకా వీళ్లు ప్రణాళికాబద్ధంగా ఉంటారు. అలాగే వ్యాపారం, ఉద్యోగాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. అంతే కాదు, బుధ గ్రహ దోషాలు తొలగి, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ప్రతి బుధవారం దేవుడి దగ్గర గరిక సమర్పిస్తే విఘ్నాలు మొత్తం తొలగుతాయి. అప్పుడప్పుడు పక్షులకు గింజలు వేస్తూ ఉండండి

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)