
తొలి వెబ్ సిరీస్ తోనే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రీల్స్ లో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన సీన్స్ ను కట్ చేసి షేర్స్ చేస్తున్నారు. రిలీజైన రోజు నుంచి ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు కూడా అదే ఫామ్ లో ఉంది. తొలి వెబ్ సిరీస్ తో కొత్త సెన్సేషన్ సృష్టించాడు.

ప్రతి యేటా మంచిర్యాల జిల్లా గూడెం గుట్ట గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఈ వేడుకలు జరిగాయి. ఈ సంబరాల్లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సీరీస్ డైరెక్టర్ డేగల బాబు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాబోయే భార్య యాంకర్ అమూల్యతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ జంట ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసిన జబర్దస్త్ ఫేమ్ డేగల బాబు పేరు బాగా వినబడుతోంది.

నిజంగా బాబు కూడా ఉహించి ఉండరు తను తీసిన మొదటి వెబ్ సిరీస్ కు ఇంత పెద్ద హిట్ అవుతుందని, ఇంకా ఇది థియేటర్లో రిలీజ్ అయి ఉంటే పాత రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేది. మొత్తానికి డైరెక్టర్ డేగల బాబు లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ప్రేక్షకులను నవ్వించాడు చివర్లో ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను ఏడిపించేశాడు.

ఇక కామెడీలో వైవా హర్ష ఇచ్చి పడేసాడు. ఇంకా క్లైమాక్స్ లో హర్ష , ఐశ్వర్య మధ్య జరిగిన లవ్ సీన్స్ కన్నీళ్ళు తెప్పించేశాయి . హైపర్ ఆది, శ్రీ విద్య కామెడీ బాగా పేలింది. తదుపరి ఎలాంటి ప్రాజెక్ట్ తో మన ముందుకు వస్తారో చూడాలి. మళ్ళీ వెబ్ సిరీస్ తీస్తారా? లేక సినిమా తీస్తారా అనేది తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.