భిక్షాటన చేస్తూ ఆలయానికి లక్షల రూపాయల విరాళం.. ఆ మహిళ ఎవరు ?.. ఎందుకు అంత డబ్బు ఇచ్చిందో తెలుసా..

|

Apr 26, 2022 | 7:04 PM

భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఓ మహిళ... లక్షల రూపాయలు ఆలయానికి విరాళం ఇచ్చింది. సాధారణంగా కనిపిస్తున్న ఆ మహిళ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు.. ఎందుకు అంత డబ్బు విరాళం ఇచ్చిందో తెలుసుకుందమా..

1 / 5

2 / 5
 ఆ మహిళ పేరు అశ్వతమ్మ. ఆమె వయసు 80 సంవత్సరాలు. 18 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆ మహిళ అయ్యప్ప స్వామి భక్తురాలు.  కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని రాజరాజేశ్వరి ఆలయానికి లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది.

3 / 5
ఆ మహిళ కర్ణాటకలోని దక్షిణ కన్నడ. ఉడిపి జిల్లాలోని దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. రాజరాజేశ్వరి ఆలయానికి శుక్రవారం లక్ష రూపాయాల విరాళాన్ని అందించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకా గంగోల్లి సమీపంలోని కంచగోడు గ్రామానికి చెందిన అశ్వతమ్మ భర్త చనిపోయిన తర్వాత ఆలయాల వద్ధే నివసిస్తుంది.

4 / 5
అశ్వతమ్మ.. తాను సంపాదించిన కొద్ది మొత్తాన్ని ఖర్చు చేసి.. మిగిలిన మొత్తాన్ని దేవాలయాలకు విరాళాలు.. దానధర్మాలు చేసే బ్యాంకులలో జమ చేస్తారు. రాజరాజేశ్వరి ఆలయం  ముందు వార్షిక ఉత్సవాల సందర్భంగా ఆ మహిళ భిక్ష అడగడం ద్వారా ఒక నెలలో లక్ష రూపాయాలు డిపాజిట్ చేసి ఆలయానికి విరాళం అందించింది.

5 / 5
అన్నదానం నిమిత్తం ఈ మొత్తాన్ని శుక్రవారం ఆలయ ధర్మకర్తకు అందజేసింది. ఎవరు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో ప్రజల నుంచి సంపాదించిన సొమ్మును తిరిగి సమాజం కోసమే అందజేస్తున్నట్లు అశ్వత్తమ్మ తెలిపారు. అయ్యప్ప భక్తురాలు అయిన అశ్వత్థమ్మ కేరళలోని శబరిమలకి మరియు కర్ణాటకలోని ఇతర దేవాలయాలకు కూడా ఆహార ధాన్యాలను విరాళంగా అందించింది. ఆమె దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలలోని అనాథ శరణాలయాలకు కూడా ఉదారంగా విరాళాలు అందజేస్తుంది.