వారెవ్వా ఇదికదా.. గుంటూరు కోడి వేపుడు అంటే ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినాల్సిందే!

Updated on: Sep 27, 2026 | 6:39 PM

గుంటూరు కోడి వేపుడు, దాని విశిష్టమైన కారం, సువాసనతో వంటకాల ప్రియులకు ఎంతో ఇష్టమైనది. ఆంధ్ర వంటకాల్లో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా, రుచికరంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. ఈ వేపుడు తయారీలో గుంటూరు ఎండుమిర్చిని ఉపయోగించడం వల్ల దీనికి ప్రత్యేకమైన కారం రుచి వస్తుంది..

1 / 5
కావలసిన పదార్థాలు.. చికెన్ (మీడియం ముక్కలు): 500 గ్రాములు, నూనె: 3-4 టేబుల్ స్పూన్లు. ఉల్లిపాయలు (పెద్దవి): 1 లేదా (మీడియంవి): 2, కరివేపాకు: 2 రెమ్మలు, ఉప్పు: రుచికి సరిపడా (మొదట 1 టీస్పూన్), అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 1/2 టీస్పూన్లు, పసుపు: 1/2 టీస్పూన్, పెరుగు: 1/2 కప్పు (లేదా 2 మీడియం టమాటాల పేస్ట్), పచ్చిమిర్చి (గాట్లు పెట్టి): 4-5, కొత్తిమీర (తరిగినది): అలంకరణకు, నిమ్మకాయ: సర్వ్ చేసేటప్పుడు, ధనియాలు: 1 టేబుల్ స్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, మిరియాలు: 1/2 టీస్పూన్, దాల్చినచెక్క: 1 1/2 అంగుళాల ముక్క, అనాస పువ్వు: 1, లవంగాలు: 5, యాలకులు: 3, ఎండుమిరపకాయలు (గుంటూరు): 12-15 (మీరు కారం తగ్గించుకోవాలంటే తక్కువ వాడండి), కొబ్బరిపొడి: 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి: 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి.

2 / 5
ముందుగా 500 గ్రాముల చికెన్‌ను మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మీడియం ముక్కలు మసాలాను బాగా పట్టి త్వరగా ఉడుకుతాయి. పాన్ వేడి చేసి, 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక టీస్పూన్ ఉప్పు వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత, 1 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచిని మరింత పెంచుతుంది.

3 / 5
శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, 1/2 టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. చికెన్ నుండి నీరు బయటకు వచ్చి, ఆ నీరు పూర్తిగా ఇంకిపోయి, నూనె పైకి తేలే వరకు మీడియం మంటపై సుమారు 10 నిమిషాలు ఉడికించాలి. ఈ దశలో చికెన్ సగం వరకు ఉడుకుతుంది. మరొక స్టవ్ మీద పాన్ వేడి చేసి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చినచెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, గుంటూరు ఎండుమిరపకాయలు (తుంచి వేయాలి) వేసి తక్కువ మంటపై దోరగా వేయించాలి. మాడనివ్వకుండా చూసుకోవాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, పాన్ వేడి మీదనే కొబ్బరిపొడి, కసూరి మేతి వేసి కలపాలి. ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

4 / 5
చికెన్ నుండి నీరంతా ఇంకిపోయి, నూనె విడిపోయిన తర్వాత, 1/2 కప్పు పెరుగు వేసి, తక్కువ మంటపై బాగా కలపాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ ముక్కలు మెత్తగా ఉడికి, కారం తగ్గుతుంది. పెరుగు వద్దు అనుకుంటే, రెండు మీడియం సైజు టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. చికెన్ పెరుగులో ఉడుకుతున్నప్పుడు, గాట్లు పెట్టిన పచ్చిమిర్చి, మిగిలిన కరివేపాకు రెమ్మ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ముక్క ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీరు పోసి ఉడికించుకోవచ్చు.

5 / 5
చికెన్ బాగా ఉడికిన తర్వాత, సిద్ధం చేసుకున్న మసాలా పొడిని 3 టీస్పూన్లు లేదా మీ కారానికి తగినంత వేసి బాగా కలపాలి. ఇప్పటికే మిరియాలు, ఎండుమిర్చి వేసినందున కారం చూసి వేయాలి. మసాలా పొడిని కలిపిన తర్వాత, తక్కువ మంటపై మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ 2-3 నిమిషాలు వేయించాలి. మసాలా పొడి మాడిపోకుండా చూసుకోవాలి. స్టవ్ ఆపి, తరిగిన కొత్తిమీరతో అలంకరించి, వేడివేడిగా సర్వ్ చేయాలి. వేడిగా ఉన్న గుంటూరు కోడి వేపుడు మీద నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. ఈ గుంటూరు కోడి వేపుడు రెసిపీ మీ ఇంట్లో స్పైసీగా, రుచికరంగా ఉండే చికెన్ వంటకాలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us