
కోడి గుడ్డు వెల్లుల్లి కారం : ఉడికించిన 5 కోడి గుడ్లు, 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ ఆవాలు, 5 కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 50 గ్రాముల చింతపండు, రెండు టీ స్పూన్స్ ఆయిల్ ను తీసుకోవాలి.

కోడి గుడ్డు వెల్లుల్లి కారం తయారి విధానం : మీరు ముందుగా కోడి గుడ్లను ఉడికించి ఆ తర్వాత పొట్టు తీసి కొంచం తడి లేకుండా వీటిని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి చిన్న పాన్ పెట్టి దీనిలో ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎండు మిరపకాయలు తీసుకుని వేయించి పెట్టుకోవాలి.

కోడి గుడ్డు వెల్లుల్లి కారం తయారి విధానం స్టెప్ 1: కోడి గుడ్డు ముక్కలను తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. అదే విధంగా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని ఒక టీ స్పూన్ నూనెలో వేసి బంగారు కలర్లోకి మారే వరకు వీటిని బాగా వేయించుకోవాలి.

కోడి గుడ్డు వెల్లుల్లి కారం స్టెప్ 2 : అదే నూనెలో కోడి గుడ్లు తీసుకుని మూడు పెద్ద గాట్లు పెట్టి 5 నిమిషాలు ఎర్రగా వేయించుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేడి చేసి ఆ తర్వాత మసాలా పొడి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కోడి గుడ్లను కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా ఆవాలు, కరివేపాకులు వేసి కలపుకోవాలి. ఇలా చేసిన కోడి గుడ్డు వెల్లుల్లి కారం పొడి, గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

కోడి గుడ్లు వెల్లుల్లి కారం నిల్వ ఉండాలంటే.. ఈ కోడి గుడ్లలో, వెల్లుల్లిలో కొంచం కూడా లేకుండా చూసుకోవాలి.లేదంటే ఇది పాడయ్యే అవకాశం ఉంది పొడి స్పూన్ తోనే తీసుకోవాలి. మొత్తం అయిపోయిన తరవాత ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే 30 రోజుల వరకు చెక్కు చెదరదు. రెండు రోజుల తర్వాత నుంచి దీనిని తింటే కారం కారంగా టేస్ట్ అదిరిపోతోంది.