పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. కిచిడీ ఎలా చేయాలో తెలుసా?

Updated on: Nov 17, 2026 | 4:17 PM

పిల్లలు ఒకే రకమైన ఫుడ్ తినడానికి అస్సలే అంతగా ఇష్టపడరు. వారు ప్రతీ సారి కొత్తగా ఏదైనా తినాలి అనుకుంటారు. అయితే వారి లంచ్ బాక్స్‌లోకి ఎప్పుడూ చేసే రిసీపీలు కాకుండా టేస్టీగా ఇలా కిచిడీ వండితే వారు ఇష్టంగా తింటారంట. కాగా, దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : బాస్మతీ బియ్యం - 1/2 కప్పు, పెసరపప్పు - 1/2 కప్పు,  నీళ్ళు - సుమారు 3 కప్పులు, ఉప్పు,   పసుపు - 1/2 టీస్పూన్, నూనె - 1 టేబుల్‌స్పూన్,   నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు,  జీలకర్ర - 1 టీస్పూన్, బిర్యానీ ఆకు - 1, దాల్చిన చెక్క - 1 ముక్క,అల్లం - చిన్న ముక్క,  వెల్లుల్లి - 3-4 రెబ్బలు,  పచ్చిమిరపకాయ - 1,  ఉల్లిపాయ - 1 , టొమాటో - 1 , కారం - 1 టీస్పూన్,   జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్,ధనియాల పొడి - 1/2 టీస్పూన్,  ఇంగువ - 1/4 టీస్పూన్, గరం మసాలా పొడి - 1/2 టీస్పూన్,   కొత్తిమీర - కొద్దిగా

2 / 5
ముందుగా 1/2 కప్పు బాస్మతీ బియ్యాన్ని, 1/2 కప్పు పెసరపప్పును విడివిడిగా శుభ్రంగా కడిగి, వాటిల్లో సరిపడా నీళ్లు పోసి కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. నానబెట్టడం వల్ల బియ్యం, పప్పు త్వరగా ఉడుకుతాయి, ఖిచిడీ కూడా మెత్తగా వస్తుంది. 30 నిమిషాల తర్వాత, నానబెట్టిన పెసరపప్పు, బాస్మతీ బియ్యాన్ని ఒక ప్రెషర్ కుక్కర్‌లోకి వేయాలి. ఇందులో సుమారు 2 కప్పుల నీళ్లు, 1 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. కుక్కర్ మూతపెట్టి, మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.  తర్వాత  ఉడికించిన మిశ్రమాన్ని కాస్త మెదిపి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఒక పెద్ద పాన్ లేదా కడాయిని స్టవ్‌పై పెట్టి, 1 టేబుల్‌స్పూన్ నూనె, 1 టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కిచిడీకి మంచి సువాసన, రుచిని ఇస్తుంది. నూనె, నెయ్యి వేడైన తర్వాత, 1 టీస్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క ముక్క వేసి వేయించాలి.  ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు రంగు మారేంతవరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారితే, రుచి బాగుంటుంది.

4 / 5
ఆ తర్వాత, సన్నగా తరిగిన 1 టొమాటో వేసి, ఒక నిమిషం పాటు వేయించాలి. టొమాటోలు కాస్త మెత్తబడిన తర్వాత, 1/2 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీస్పూన్ ధనియాల పొడి, 1/4 టీస్పూన్ ఇంగువ, 1/2 టీస్పూన్ గరం మసాలా పొడి వేసి, అంతా బాగా కలిసేలా వేయించాలి. టొమాటోలు పూర్తిగా మెత్తబడి, మసాలాలు బాగా కలిసిపోయేంతవరకు వేయించాలి.

5 / 5
టొమాటోలు బాగా మగ్గిన తర్వాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు, అన్నం మిశ్రమాన్ని ఇందులో వేసి అంతా బాగా కలపాలి. ఒకవేళ కిచిడీ మరీ చిక్కగా అనిపిస్తే, 1 కప్పు వేడి నీళ్లు పోసి, కావలసిన నిలకడకు తీసుకురావచ్చు.చివరగా, 1 టీస్పూన్ నెయ్యి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి, అంతా బాగా కలపాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us