
మున్నార్: సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ హిల్ స్టేషన్ టీ తోటలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి పొగమంచుతో నిండిన కొండలు,ఎరవికుళం నేషనల్ పార్క్ పర్యాటకులను కట్టిపడేస్తాయి. అందుకే కేరళ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాలను చూడాలి అనుకుంటారు.

అలప్పుజ: కేరళ పర్యటనలో హౌస్‌బోట్ ప్రయాణం లేకపోతే ఆ యాత్రే పూర్తి కాదు. మీకు కూడా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే.. 'వెనిస్ ఆఫ్ ది ఈస్ట్' అని పిలవబడే ఇక్కడి బ్యాక్‌వాటర్స్ గుండా ప్రయాణిస్తూ కేరళ గ్రామీణ అందాలను చూడవచ్చు. ఇది మీకు లైఫ్‌లో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. చాలా మెమోరీస్‌ను అందిస్తుంది.

వయనాడ్, కోవలం: అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వారికి వయనాడు సరైన చోటని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడి ఎడక్కల్ గుహలు, బాణాసుర సాగర్ డ్యామ్, దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్‌కు అద్భుతంగా ఉంటాయి. ఇవి మీకు లైఫ్‌లోనే బెస్ట్ అడ్వెంచర్ అనుభూతిని ఇస్తుంది. ఇక కోవలం విషయానికి వస్తే ప్రపంచ ప్రసిద్ధ లైట్‌హౌస్ బీచ్ ఇక్కడే ఉంది. ఇక్కడ నీలిరంగు సముద్ర అలల మధ్య సూర్యాస్తమయాన్ని చూడటం ఒక అద్భుత అనుభూతి అనే చెప్పవచ్చు.

థెక్కడి, కొచ్చి: థెక్కడి జంతుప్రేమికులకు ఇదో స్వర్గదామమే.. ఎందుకంటే పెరియార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంది. ఇక్కడ ఏనుగుల సవారీ, అడవిలో బోట్ సఫారీ, సుగంధ ద్రవ్యాల తోటల సందర్శన ఇక్కడి ప్రత్యేకత. ఇక కొచ్చి విషయానికి వస్తే.. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ నగరంలో చైనీస్ ఫిషింగ్ నెట్స్, జ్యూ టౌన్, మట్టంచెరి ప్యాలెస్ వంటి వాటిని మీరు చూడవచ్చు.

వర్కల,కుమరకోమ్: వర్కల్ బీచ్.. అరేబియా సముద్రం పక్కనే ఉన్న ఎత్తైన కొండలలే ఈ వర్కల బీచ్ ప్రత్యేకత. ఆధ్యాత్మికత, బీచ్ లైఫ్ కోరుకునే వారికి ఇది సరైన ప్లేస్ అనే చెప్పవచ్చు. అలాగే పక్షుల అంటే ఇష్టపడే వారికి కుమరకోమ్ మంచి అనుభాలను అందిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. వెంబనాడ్ సరస్సు తీరాన ఉండే ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. విలాసవంతమైన రిసార్టులలో ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. కేరళ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అదొక అనుభవం. సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం