
ధనాకర్షణ, సంపద పెరుగుదల: ఫెంగ్ షుయ్ ప్రకారం, రబ్బర్ ప్లాంట్ యొక్క దట్టమైన, ఆకుపచ్చని, గుండ్రటి ఆకులు సంపద, ప్రాభావానికి సంకేతం. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా నిరోధించవచ్చు. వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుముఖం పట్టి ధన ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు.

వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి?: రబ్బర్ ప్లాంట్ నుండి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వాస్తు నియమాలు పాటించడం ముఖ్యం. ఆగ్నేయం అనేది ఆగ్నేయ కోణంలో లక్ష్మీదేవి, శుక్ర గ్రహానికి సంబంధించిన దిశగా భావిస్తారు. ఈ దిశలో రబ్బర్ ప్లాంట్ ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

ఇంటి నైరుతి మూలలో ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి మరియు కెరీర్‌లో స్థిరత్వం వస్తుంది. ఈ మొక్కను ఈశాన్యం దిశలో లేదా పడకగది లో సరిగ్గా గాలి తగలని చోట ఉంచకూడదు. అంతేకాకుండా, ఇది ఇంట ఉన్న హానికర వాయువులను తొలగించి గాలిని శుద్ధి చేసే ఇన్-డోర్ ప్లాంట్‌గా కూడా పనిచేస్తుంది. అందంతో పాటు వాస్తు ప్రయోజనాలు అందించే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం శ్రేయస్కరం.

కేవలం వాస్తు పరంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా రబ్బర్ ప్లాంట్ ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫైయర్. ఇంటి లోపల ఉన్న గాలిలోని కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి విషపూరిత పదార్థాలను గ్రహించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

రబ్బర్ ప్లాంట్‌కు ఎక్కువ నిర్వహణ అవసరం లేదు. దీనికి తక్కువ సూర్యరశ్మి మరియు తక్కువ నీరు సరిపోతాయి. వారం రోజులు నీరు పోయకపోయినా ఇది పచ్చగా ఉంటుంది. కాబట్టి, మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి, ప్రశాంతత, ఐశ్వర్యం కలగాలంటే ఒక చిన్న రబ్బర్ ప్లాంట్‌ను తెచ్చి సరైన వాస్తు దిశలో అమర్చుకోవడం మంచిది.