
ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను తీసుకోవాలి. ఎర్ర గోధుమ రవ్వతో హల్వా చేస్తే అన్నవరం ప్రసాదం రుచిని ఇంట్లోనే పొందవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, రవ్వ మాడిపోకుండా కలుపుతూ కనీసం ఏడెనిమిది నిమిషాల పాటు బాగా వేయించాలి. రవ్వను ఎంత బాగా వేయిస్తే హల్వా రుచి అంత బాగుంటుంది.

రవ్వ చక్కగా వేగిన తర్వాత, పక్కన వేడి చేసుకున్న నీటిని రవ్వలోకి కొద్దికొద్దిగా పోయాలి. ఒకేసారి నీళ్లు పోస్తే రవ్వ పొంగిపోవచ్చు కాబట్టి, నెమ్మదిగా కలుపుతూ నీళ్లు మొత్తం పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రవ్వ చక్కగా ఉడికేంత వరకు ఉడికించాలి. రవ్వను మూతపెట్టి లేదా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించవచ్చు. బెల్లం వేయడానికి ముందే రవ్వ పూర్తిగా ఉడకాలి, ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత రవ్వ ఉడకదు. నాలుగైదు నిమిషాలకు నీళ్లన్నీ దగ్గరపడి రవ్వ బాగా ఉడుకుతుంది.

రవ్వ ఉడికిన తర్వాత, మనం ఏ కప్పుతో రవ్వను కొలిచామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లానికి బదులుగా చక్కెరను కూడా వాడవచ్చు, కానీ ఆరోగ్యానికి మేలు చేయాలంటే బెల్లాన్ని వాడడం మంచిది. బెల్లం వేసిన తర్వాత బాగా కలిపి, బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉడికించాలి. బెల్లం కరగడం వల్ల హల్వాకు మంచి రంగు, మెరుపు వస్తాయి.

బెల్లం పూర్తిగా కరిగి మంచి రంగు వచ్చిన తర్వాత, మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి, మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. దీని వల్ల హల్వాకు మంచి పాకం వచ్చి, రుచి మరింత పెరుగుతుంది. మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలపాలి.

ఈ దశలో హల్వా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది, చల్లబడిన తర్వాత మరింత దగ్గర పడుతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మంచి టేస్ట్ కోసం అర టీస్పూన్ యాలకుల పొడి, గుడి ప్రసాదం రుచి కోసం శనగపప్పు అంత పచ్చ కర్పూరం వేసి బాగా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ హల్వా రెడీ.