కార్తీక మాసం స్పెషల్.. శివుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఇవే

Updated on: Nov 11, 2026 | 1:09 PM

కార్తీక మాసం అంటేనే శివుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నిత్యం ఆలయాలకు వెళ్తూ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. నిత్యం ఉపవాసం ఉంటూ, శివారాధన చేస్తుంటారు. అలాగే ఈ మాసంలో శివుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తుంటారు. కాగా, మనం ఇప్పుడు శివుడికి ప్రీతికరమైన నైవేద్యాలు ఏవో చూసేద్దాం.

1 / 5
  పంచామృతం: శివుడికి చాలా ప్రీతకరమైన నైవేద్యాలలో పంచామృతం మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే శివ పూజలో ఇది తప్పకుండా ఉంటుంది. పరమేశ్వరుడి అభిషేకానికి, నైవేద్యానికి పంచామృతాన్ని ఉపయోగిస్తారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఈ ఐదు పదార్థాలను శుభ్రమైన పాత్రలో కలిపి పంచామృతం సిద్ధం చేసుకోవచ్చు. భక్తితో శివలింగానికి పంచామృత అభిషేకం చేసి నైవేద్యంగా సమర్పించడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

2 / 5
పరమాన్నం: శివుడికి ఇష్టమైన నైవేద్యాలలో పరమాన్నం ఒక్కటి. చాలా మంది కార్తీక మాసంలో పూజ చేసే సమయంలో పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని పాలు, బియ్యం, బెల్లంతో తయారు చేస్తారు.  బియ్యాన్ని పాలలో ఉడికించి, తర్వాత తగినంత బెల్లం కలిపి పరమాన్నాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా తయారైన పరమాన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

3 / 5
తీపి పొంగలి : తీపి పొంగలి. ప్రత్యేకంగా చేసే నైవేద్యాలలో ఇది ముందుంటుంది. శివుడికి చాలా ఇష్టమైన ప్రసాదంలో ఇదొక్కటి. అందుకే దీనిని పండుగల సమయంలో చాలా ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు.  బియ్యం, పెసరపప్పు కలిపి మెత్తగా ఉడికించాలి. తర్వాత బెల్లంపాకం కలిపి రుచికరమైన తీపి పొంగలి తయారు చేయాలి. ఈ పొంగలిని కూడా పరమశివునికి భక్తితో సమర్పించవచ్చు.

4 / 5
పాలు: కార్తీక మాసంలో శివుడి అనుగ్రహం పొందడానికి చాలా మంది పాలతో అభిషేకం చేస్తుంటారు. శివారాధనలో పాలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. చాలా మంది భక్తులు శివలింగానికి పాలతో అభిషేకం చేస్తారు. ఇది ఎంతో పవిత్రమైన పూజగా భావిస్తారు. పాలతో శివుడిని ప్రసన్నం చేసుకుంటే అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

5 / 5
బెల్లం, నువ్వుల ఉండలు : ఇవి సంప్రదాయంగా తయారు చేసే తీపి వంటకం. వేయించిన నువ్వులు, బెల్లం ఈ వంటకానికి ప్రధాన పదార్థాలు. ఈ రెండింటినీ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు. వీటిని కూడా శివుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us