
కార్తీక మాసంలో భక్తులు పాటించాల్సిన నియమాలను, అలాగే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కార్తీక మాసం అంటే శివునికి, విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది, కాబట్టి ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉండటం చాలా ముఖ్యం. కార్తీక మాసంలో ఇక్కడ చెప్పే వాటిని తప్పక పాటిస్తే.. నెల తిరిగేలోపు మీ జాతకమే మారిపోతోందని పండితులు చెబుతున్నారు.

కార్తీక మాసం అంటే ప్రతిరోజు తలస్నానం చేయాలి, ఉపవాసం ఉండాలి, జాగారం చేయాలి అనే వాటికీ దూరంగా ఉండాలి. అధిక తలస్నానాలు జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. ఇంకా జాగారం అంటే రాత్రంతా నిద్ర మానేసి సినిమాలు చూడటం కాదు, ఆధ్యాత్మిక విషయాలపై మేల్కొని ఉండటం అని అర్థం చేసుకోవాలి.

ఇంకో ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం సహకరించినంత వరకే ఉపవాసాలు, జాగారాలు చేయాలి. అంతేకానీ, ఆరోగ్యం బాగలేకపోయిన ఉపవాసాలు ఉండి ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకోకండి. బాధలు పోతాయని అధిక ఉత్సాహంతో పదేపదే చేయకూడని పనులు అస్సలు చేయకండి.

వీలైతే ఏదో ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. నదీ స్నానం కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు, "తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావనీ సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా" అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయవచ్చు. బ్రాహ్మణులకు దీపదానం చేయడం అత్యంత పుణ్యప్రదం.

"ఏకతః సర్వదానాని దీపదానం తదైకతః" అంటే అన్ని దానాలకు దీపదానం సమానమని శాస్త్రం చెబుతోంది. దీపదానం చేసేటప్పుడు వారికి కొంత ధనం (దక్షిణ) ఇవ్వడం కూడా మర్చిపోకూడదు, ఇది వారి కష్టానికి, చేసే అనుష్ఠానాలకు ప్రతిఫలం. కార్తీక మాసంలో శివనామస్మరణతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని చెబుతున్నారు.